రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు వెంకన్న పేరు

3 Mar, 2017 23:58 IST|Sakshi
రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు వెంకన్న పేరు

- రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం
- శ్రీవారి భక్తుల్లో ఆనందం


తిరుపతి : రేణిగుంటలో ఉన్న తిరుపతి అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు పేరు మారనుంది. త్వరలో దీన్ని శ్రీ వేంకటేశ్వర అంతర్జాతీయ విమానాశ్రయంగా పిలవనున్నారు. గురువారం అమరావతిలో జరిగిన రాష్ట్ర కేబి నెట్‌ సమావేశంలో మంత్రులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఒకట్రెండు మాసాల్లో ఈ మేరకు ఎయిర్‌పోర్ట్సు అధారి టీకి ఉత్తర్వులు అందే అవకాశాలున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.

తిరుపతి ఎయిర్‌పోర్టును 1976లో ఏర్పాటు చేశారు. ఆ తరువాత పీవీ నరసింహారావు ప్రధాని హోదాలో రూ.11 కోట్లు మంజూరు చేసి ఆ యా నిధులతో న్యూ టెర్మినల్‌ భవనాన్ని, న్యూ రన్‌ వే, రేడియో టవర్‌లను నిర్మించారు. 1999 నుంచి ప్యాసింజర్‌ ట్రాఫిక్‌ పెరిగింది. ప్రస్తుతం రోజూ 10 వి మానాలు ఇక్కడి నుంచి బయలుదేరుతున్నా యి. హైదరాబాద్, కోయంబత్తూరు, న్యూ ఢిల్లీ, విశాఖపట్నం, విజయవాడ వెళ్లే ప్రయాణికులకు తిరుపతి నుంచి విమాన ప్రయాణం సులభతరమైంది. ఎయిర్‌కోస్తా, స్పైస్‌జెట్, ట్రూ జెట్, ఎయిర్‌ ఇండియా సంస్థలకు చెందిన విమానాలు రోజుకు 1000 నుంచి 1500 మందిని సుదూర ప్రాంతాలకు చేర వే స్తున్నాయి. సుమారు 12 దేశాల నుంచి విదేశీ యాత్రికులు తిరుపతి చేరుకుని శ్రీవారిని దర్శిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తిరుపతి ఎయిర్‌ పోర్టులో దిగే దేశ విదేశాలకు చెందిన ప్రయాణికులందరూ ఎయిర్‌పోర్టులోనే స్వామి వారిని స్మరించుకునేలా ఉండాలంటే పేరు మా ర్చడం ఎంతో అవసరమన్న ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. తిరుపతి ఎయిర్‌పోర్టును శ్రీవేంకటేశ్వర ఎయిర్‌పోర్టుగా మా ర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం తీసుకున్న నిర్ణయాన్ని కేబినెట్‌ కేంద్రానికి పంపితే అక్కడి మినిస్ట్రీ ఆఫ్‌ ఏవియేషన్‌ పరి శీలించి ఆమోదాన్ని వ్యక్తం చేసి, ఎయిర్‌పోర్టు అధారిటీకి పంపుతుంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తవడానికి కనీసం రెండు నెలలు పడుతుం ది. ఈ లెక్కన వచ్చే మే నెల తరువాత  ఎయిర్‌పోర్టును  వెంకన్న పేరుతో పిలుచుకోవచ్చన్నమాట. కేబినెట్‌ తీసుకున్న నిర్ణయంతో శ్రీవారి భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు