మొక్కల సంరక్షణ నివేదికలు పంపాలి

30 Jul, 2016 23:17 IST|Sakshi
మొక్కల సంరక్షణ నివేదికలు పంపాలి
  • ఇప్పటివరకు 2.24కోట్ల మొక్కలు
  • హన్మకొండ అర్బన్‌ : జిల్లాలో ఇప్పటివరకు 2.24 కోట్లమొక్కలు నాటడం పూర్తయిందని కలెక్టర్‌ వాకాటి కరుణ తెలిపారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మండల ప్రత్యేక అధికారులు, జిల్లా అధికారులతో హరితహారంపై శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మండలాల వారీగా మొక్కల సంరక్షణ కోసం తీసుకున్న సూక్ష్మప్రణాళికలు పంపించాలని అన్నారు. ఇప్పటివరకు పంపించని వారు వెంటనే పంపాలని అన్నారు. నీటిసదుపాయం, రక్షణ చర్యలకోసం కావాల్సిన నిధులకోసం ప్రతిపాదనలు పంపించాలని కలెక్టర్‌ ఆదేశించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షణ బాధ్యతలు సంబంధిత శాఖలే తీసుకోవాలని చెప్పారు. ప్రస్తుతం నర్సరీల్లో ఉన్న మొక్కలు సరిపోక పోతే పండ్ల, పూల మొక్కలు తెప్పించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో జేసీ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్, పీవో అమయ్‌కుమార్, డీఎఫ్‌వో శ్రీనివాస్, డ్వామా పీడీ శేఖర్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు