రేషనలైజేషన్‌ యోచనను విరమించుకోవాలి

8 Aug, 2016 00:10 IST|Sakshi
విద్యారణ్యపురి : ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలల రేషనలైజేషన్‌ యోచనను విరమించుకోవాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం(ఎస్‌టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు బి.భుజంగరావు ప్ర భుత్వాన్ని డిమాండ్‌ చేశారు. హన్మకొండలోని ఎస్‌టీయూ భవనంలో ఆదివారం జరిగిన సం ఘంస్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅ తిథిగా హాజరై మాట్లాడుతూ 2014లో  రేషనలైజేషన్‌ కోసం జీవో 6ను విడుదల చేశాక వ్యతి రేకత వ్యక్తం కావడంతో అప్పట్లో విరమించుకుం దన్నారు. అయితే, మళ్లీ రేషనలైజేషన్‌ను తెరపైకి తీసుకురావడం సరికాదని, వేసవి సెలవుల్లోనే బదిలీలు, రేషనలైజేషన్‌ ప్రక్రియ చేపట్టాలన్నారు. బడిబాట కార్యక్రమంతో పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీతో కూడినఆంగ్లమాధ్యమంను అనుమతించాలన్నారు.  ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడు ఎ.సదయ్య, జిల్లాప్రధాన కార్యదర్శి పి.లక్ష్మినర్సయ్య, బా««దl్యులు అంబాప్రసాద్, బి.రవి, ఆర్‌.లక్ష్మణ్‌రావు, ఎన్‌.రమేష్, ఎన్‌.సాంబయ్య,బి.రమేష్, సుధాకరాచారి, ఏకాంబరాచారి, కె.సురేష్, ఎ.శ్రీధర్, డి. నాగరాజు, డి.శివకోటి, ఎన్‌.శ్రీహరి పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు