మహిళలకు రిజర్వేషన్లు అవసరం లేదు

9 Nov, 2015 01:13 IST|Sakshi
మహిళలకు రిజర్వేషన్లు అవసరం లేదు

కేంద్ర మంత్రి సుజనాచౌదరి వ్యాఖ్య

 విజయవాడ(లబ్బీపేట)/గుంటూరు రూరల్ : మహిళలకు రిజర్వేషన్లు అవసరం లేదని, రిజర్వేషన్ పేరుతో కుర్చీపై స్టాంప్ వేసి మహిళలను కూర్చోపెట్టడం తప్పని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి వై.సుజనాచౌదరి వ్యాఖ్యానించారు. అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తుంటే  రిజర్వేషన్లు ఎందుకని, వాటికి తాను వ్యతిరేకినని ఆయన పేర్కొన్నారు. విజయవాడలోని మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీలో ఏర్పాటుచేసిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా ఏపీ చాప్టర్ కార్యాలయాన్ని శనివారం కేంద్ర మంత్రి సుజనాచౌదరి ప్రారంభించారు.

మరిన్ని వార్తలు