తేలు కాటుకు గురైన ‘ఆశ్రమ’ విద్యార్థి

28 Jul, 2016 00:58 IST|Sakshi
కొత్తగూడ: తేలు కాటుకు గురై ఆశ్రమ పాఠశాల విద్యార్థి చికిత్స పొందుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని కామారం ఆశ్రమ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న ఈక రవికుమార్‌ రెండు రోజుల క్రితం సాయంత్రం భోజనం చేసి ఇంటికి వెళ్లే క్రమంలో తేలు కుట్టింది.
 
పాఠశాల మొత్తంలో 37 మంది స్థానిక గ్రామ విద్యార్థులే చదువుతుండటంతో ఉదయం, సాయంత్రం భోజనం పెట్టిన తరువాత విద్యార్థులను ఇంటికి పంపిస్తున్నారు. కాగా ఇంటికి వెళ్లే సమయంలో తేలు కాటు వేయడంతో విద్యార్థి పరిస్థితి విషమంగా మారింది. ఉపాద్యాయులు వెంటనే హన్మకొండలోని అమృత ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఈవిషయమై ఏటీడబ్ల్యూఓ మోహన్‌రావును వివరణ కోరగా తేలు కుట్టింది నిజమేనని చెప్పారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నట్లు తెలిపారు. డిప్యూటీ వార్డెన్‌కు ఐటీడీఏ డీడీ పోచం మెమో జారీ చేసినట్లు తెలిసింది.  
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌

కాంట్రాక్ట్‌ కార్మికులందరికీ బోనస్‌ చెల్లించాలి

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ : 10 మందికి గాయాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పవన్‌ కళ్యాణ్‌పై జాలేసింది

మరో సినిమా లైన్‌లో పెట్టిన విజయ్‌

ఇక పాకిస్తాన్‌ గురించి ఏం మాట్లడతాం?

‘నిశబ్ధం’ మొదలైంది!

చిన్నా, పెద్ద చూడను!

‘సీత’ మూవీ రివ్యూ