జల చౌర్యం అరికట్టే బాధ్యత ప్రత్యేక బృందాలదే

22 Oct, 2016 23:26 IST|Sakshi
కర్నూలు సిటీ: తుంగభద్ర దిగువ కాలువ నీరు చౌర్యం కాకుండా అరికట్టే బాధ్యత ప్రత్యేక బృందాలదేనని జల వనరుల శాఖ పర్యవేక్షక ఇంజినీర్‌ చంద్రశేఖర్‌ రావు చెప్పారు. శనివారం జల మండలిలోని ఎస్‌ఈ చాంబర్‌లో ఎల్‌ఎల్‌సీ అధికారులు, ప్రత్యేక బృందాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ మాట్లాడుతూ దిగువ కాలువ నీటిని 135 నుంచి 250 కి.మీ మధ్యలో అధికంగా చౌర్యం చేస్తున్నారని చెప్పారు. దీన్ని పూర్తి స్థాయిలో అరికడితేనే చివరి ఆయకట్టుకు నీరు అందుతుందన్నారు. ప్రత్యేక బృందాలు కాల్వపై ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని డీఈఈ నెహిమియాకు ఆదేశించారు. సమావేశంలో ఈఈ భాస్కర్‌రెడ్డి, డీఈఈలు తదితరులు పాల్గొన్నారు.
 
>
మరిన్ని వార్తలు