విశ్రాంత లోకో పైలెట్ల ఆత్మీయ కలయిక

10 Apr, 2017 12:44 IST|Sakshi
 
విజయవాడ:  విశ్రాంత లోకో పైలెట్ల ఆత్మీయ కలయిక కార్యక్రమం కొత్త సంఘ్‌ కార్యాలయంలో ఆదివారం జరిగింది.  కార్యక్రమానికి ముఖ్యఅతి«థిగా సంఘ్‌ డివిజనల్‌ కార్యదర్శి బండ్రెడ్డి వెంకట చలపతిరావు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ లోకో పైలెట్‌ విధులు నిర్వహించడం కత్తి మీదసాము లాంటిదన్నారు. పదవీ విరమణ చేసి నేడు వారంతా ఆత్మీయంగా కలవడం శుభపరిణామమన్నారు. ఈ సందర్భంగా లోకోపైలెట్‌గా విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన 80 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారిని ఈ సందర్భంగా సంఘ్‌ డివిజనల్‌కార్యదర్శి చలపతిరావు సన్మానించారు. కార్యక్రమంలో సంఘ్‌కేంద్ర కమిటీ సభ్యుడు యడ్ల నాగేంద్రబాబు, ఆరోగ్య కార్యదర్శి బి.సత్యనారాయణ, తిరుమలరావు, ప్రకాశ్‌ పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు