రెవెన్యూ అసోసియేషన్‌ వినతిపత్రం

4 Oct, 2016 23:33 IST|Sakshi
రెవెన్యూ అసోసియేషన్‌ వినతిపత్రం
చాగలమర్రి: ఆర్‌డీఓ సుధాకర్‌రెడ్డి మంగళవారం చాగలమర్రికి వచ్చి తహసీల్దార్‌ ఆంజనేయులుతో మాట్లాడి దాడికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మండలస్థాయి అధికారులు పనులు చేయకుంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలే తప్ప దాడులు చేయడం సరికాదన్నారు.ఈ సందర్బంగా రెవెన్యూ డివిజన్‌ ఉద్యోగుల సంఘం అ«ధ్యక్షుడు సుబ్బారాయుడు ఆధ్వర్యంలో డివిజన్‌ పరిధిలోని తహశీల్దార్లు.. ఎస్పీ ఆకే రవికృష్ణ, డీఎస్పీ ఈశ్వరరెడ్డికి వినతి పత్రాన్ని అందించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఎస్సీ ఎస్టీ మానిటరింగ్‌ కమిటి అధ్యక్షురాలు చిటికేల సలోమి అన్నారు.
 
మరిన్ని వార్తలు