రెవెన్యూ అధికారులపై హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు

11 Aug, 2016 00:49 IST|Sakshi
నాంపల్లి(హైదరాబాద్‌) : భూమిని ఆక్రమించి అనుభవిస్తున్న వ్యక్తులు, వారికి సహకరించిన రెవెన్యూ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ వర్ధన్నపేట మండ లం జగ్గయ్యగుండ్ల గ్రామానికి చెందిన జోజి రెడ్డి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశారు.బాధితుడి ఫిర్యాదు ప్రకా రం.. సొంత గ్రామంలో పూర్వీకుల నుంచి సంక్రమించిన భూమి సర్వే నంబరు 2157, 2158 రెండున్నర ఎకరాలు, సర్వే నంబరు  749/50లో రెండున్నర ఎకరాలు ఉందన్నారు.
 
అయితే 1994లో సర్వే నంబ రు– 749/50 లోని రెండున్నర ఎకరాల్లో ఒక ఎకరం భూమి అదే గ్రామానికి చెందిన గొలమారి చిన్నపరెడ్డికి అమ్మేసినట్లు వివరించారు. తదనంతరం జగ్గయ్యగుండ్ల గ్రా మం నుంచి ఉపాధి కోసం తన కుటుంబం హైదరాబాదుకు వచ్చేసినట్లు పేర్కొన్నారు. 
]
హైదరాబాదుకు వచ్చేశాక తమ నుంచి ఎకరం భూమి కొనుగోలు చేసిన గొలమారి చిన్నపరెడ్డి రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై రెండున్నర ఎకరాలను కొన్నట్లుగా ఫోర్జరీలు చేసి పట్టాపాస్‌ పుస్తకాల్లో రాయించుకున్నట్లు తెలిపారు. ఈ విషయం సదరు వీఆర్వో దృష్టికి తీసుకెళ్లగా తమకేమీ తెలియదంటూ తప్పించుకుని తిరుగుతున్నారని పేర్కొన్నారు. అలాగే 2157, 2158 సర్వే నంబర్లలోని కొంత భూమిని స్థానికులు ఆక్రమించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అన్యాక్రాంతానికి గురైన తన భూమి తనకు ఇవ్వాలని, పహాణీలో దొర్లిన తప్పులను సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదును స్వీకరించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ 20 అక్టోబరు 2016న జరిగే విచారణకు కేసుకు సంబంధిం చిన పూర్వాపరాలను అందజేయాలని వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.  
మరిన్ని వార్తలు