పప్పుశెనగ పంపిణీ ఏర్పాట్లపై సమీక్ష

23 Sep, 2016 22:58 IST|Sakshi

అనంతపురం అగ్రికల్చర్‌ : రాయితీ పప్పుశెనగ పంపిణీ ఏర్పాట్లపై జాయింట్‌ కలెక్టర్‌–2 ఖాజా మొహిద్దీన్‌ శుక్రవారం వ్యవసాయశాఖ అధికారులతో సమీక్షించారు. తన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జేసీ–2 మాట్లాడుతూ సాధ్యమైనంత త్వరగా పంపిణీ ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. పంపిణీ చేస్తున్న 27 మండలాల్లోనూ ఆధార్‌బేస్డ్‌ బయోమెట్రిక్‌ పద్ధతి అమలు చేయాలని ఆదేశించారు. జిల్లాకు 50 వేల క్వింటాళ్లు కేటాయించగా సరఫరా చేసే బాధ్యతలు ఏపీ సీడ్స్‌ 30 వేల క్వింటాళ్లు, ఆయిల్‌ఫెడ్‌కు 20 వేల క్వింటాళ్లు అప్పగించామన్నారు.

ఒక ఎకరా లోపున్న రైతులకు 25 కిలోలు, ఆపైనున్న రైతులకు 50 కిలోలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. 25 కిలోల బస్తా పూర్తి విలువ రూ.2,466.50 కాగా అందులో రాయితీ పోనూ రైతు తన వాటాగా రూ.1,480 చెల్లించాలన్నారు. పంపిణీ చేస్తున్న 27 మండలాల్లో విత్తన నిల్వకు గోడౌన్లు, పంపిణీ కేంద్రాల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. రెండు రోజుల్లో 50 శాతం విత్తనం నిల్వ చేయాలన్నారు. త్వరలోనే పంపిణీ తేదీలు ప్రకటిం^è నున్నట్లు తెలిపారు. సమావేశంలో వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి, ఏపీ సీడ్స్‌ జిల్లా మేనేజర్‌ పి.కోటేశ్వరరావు, ఆయిల్‌ఫెడ్‌ అధికారులు పరమేశ్వరయ్య, ఏకాంబరరావు, టెక్నికల్‌ ఏవో వెంకటప్రసాద్‌యాదవ్, ఎన్‌ఐసీ అధికారి కె.రాజా, సీనియర్‌ అసిస్టెంట్‌ ఫల్గుణ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు