ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు

12 Aug, 2016 19:18 IST|Sakshi
ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు
సూర్యాపేట మున్సిపాలిటీ
 శ్రావణమాసం రెండో శుక్రవారాన్ని పురస్కరించుకొని పట్టణంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంతో పాటు పలు దేవాలయాల్లో వరలక్ష్మి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు ఇరువంటి శివరామకృష్ణశర్మ ఆధ్వర్యంలో దేవాలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. సంతోషిమాతను ప్రత్యేక ఊయలలో పరుండబెట్టి పవళింపు సేవ నిర్వహించారు. కార్యక్రమంలో బ్రాహ్మండ్లపల్లి మురళీధర్, దయాకర్, సురేష్, విద్యాసాగర్, పాపిరెడ్డి, శ్రీకాంత్, పురుషోత్తం, జగన్నాథశర్మ, బాబ్జి తదితరులు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు