చెరువులకు జల కళ..

24 Jul, 2016 18:43 IST|Sakshi
చెరువులకు జల కళ..
  • అందోలు, అన్నాసాగర్‌ పెద్ద చెరువులకు వర్షపు నీరు
  • రైతన్నల్లో ఆనందం
  • జోగిపేట : అందోలు మండలంలోని చెరువులు, కుంటలు నీటితో కళ కళలాడుతున్నాయి. ఐదు రోజుల క్రితం ఏ మాత్రం నీళ్లే లేని అన్నాసాగర్‌ పెద్ద చెరువులో ఒకేసారి భారీగా నీరు వచ్చి చేరింది. రెండు మాసాల క్రితం మిష¯ŒS కాకతీయ పథకం కింద ఈ చెరువులో పూడికతీత పనులు చేపట్టారు.  చెరువులోకి కాల్వల ద్వారా బ్రాహ్మణపల్లి, నేరడిగుంట, డాకూర్‌ గ్రామాలమీదుగా నీరు వచ్చి చేరింది. అలాగే అందోలు పెద్ద చెరువులోకి వర్షపు నీరు వచ్చి చేరింది. నాలుగు రోజులు నుంచి ఈ ప్రాంతంలో భారీగా వర్షం కురుస్తోంది.

    దీంతో గ్రామాల్లోని కుంటల్లో కూడా నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటి వరకు నాలుగు రోజుల్లో 5 సెం.మీ వర్షం కురిసినట్లు అధికారులు అంటున్నారు. గ్రామాల్లో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. అన్నాసాగర్‌ చెరువు కింద రైతులు వరి నాట్లు దాదాపు పూర్తి చేస్తున్నారు. పోసానిపేట, డాకూరు, అక్సా¯ŒSపల్లి, జోగిపేట, అందోలు, కొడెకల్, నాదులాపూర్, తాలెల్మ ప్రాంతాల్లోని కుంటల్లో వర్షపు నీరు వచ్చి చేరింది. ప్రతిరోజూ ఈ ప్రాంతంలో వర్షం కురుస్తూనే ఉంది. వారం పాటు ఇలాగే వర్షాలు కురిస్తే భూగర్భజలాలు పెరిగే అవకాశం ఉందని రైతులు అంటున్నారు.

    చెరువులోకి నీరు రావడం సంతోషంగా ఉంది
    అన్నాసాగర్‌ పెద్ద చెరువులో ఇటీవల మిష¯ŒS కాకతీయ పథకం కింద పూడిక తీత పనులు చేపట్టారు. ఇది కొంతమేరకు ఉపయోగపడింది.  ఖరీఫ్‌ సీజ¯ŒS ప్రారంభంలో చుక్కనీరు లేకపోవడంతో ఆందోళన చెందాం. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షపు నీరు చెరువులోకి చేరింది.
    – మల్లేశం, రైతు , అన్నాసాగర్‌

    చెరువులు నిండితేనే ప్రయోజనం
    పోసానిపేట చెరువులోకి వేరే కాలువల ద్వారా నీరు వచ్చే పరిస్థితి లేకపోవడంతో కేవలం వర్షం నీరుతో మాత్రమే చెరువు నిండే అవకాశం ఉంది. నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. వర్షాకాలంలో అనుకున్నంతగా వర్షాలు కురుస్తే రైతులు గట్టెక్కినట్లే.
    – దుర్గయ్య, రైతు,  పోసానిపేట
     

మరిన్ని వార్తలు