ఘాట్‌రోడ్‌లో రెండు వాహనాలు ఢీ

6 Aug, 2016 22:52 IST|Sakshi
రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయిన ట్రైలర్‌ వాహనం
జాతీయ రహదారిపై నిలిచిపోయిన వాహనాలు
అవస్థలు పడిన ప్రయాణికులు
పోలీస్‌ చొరవతో కదిలిన వాహనాలు
 
 
పి.కోనవలస(పాచిపెంట) : మండలంలోని పి.కోన వలస సమీపంలో గల మూడోనంబర్‌ జాతీయ రహదారిపై శనివారం ఉదయం రెండు వాహనాలు ఢీ కొనడంతో రోడ్డుకు అడ్డంగా ట్రైలర్‌ నిలిచిపోయింది. దీంతో వందలాది వాహనాలు పి.కోనవలస జాతీయ రహదారి నుంచి మూడో నంబర్‌ జాతీయ రహదారి వరకూ నిలిచిపోవడంతో వాహన యజమానులతో పాటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న పాచిపెంట ఎస్‌ఐ జి.డి.బాబు సంఘటనా స్థలానికి చేరుకుని సాలూరు సీఐ జి.రామకష్టకు సమాచారం తెలియజేయడంతో ఆయన హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేశారు. ఆంధ్ర–ఒడిశా రాష్ట్రాలకు ప్రయాణాలు సాగిస్తున్న ఆర్‌టీసీ బస్సులు చాలా వరకూ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ఘాట్‌ రోడ్డు కావడం వల్ల కనీసం మంచినీరు కూడా దొరకక పోవడంతో చిన్నపిల్లలతో వారు పడిన అవస్థలు వర్ణనాతీతం. దాదాపు మూడు గంటల అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ట్రాఫిక్‌ను నెమ్మదిగా క్లియర్‌ చేయడంతో వాహన రాక పోకలు సాగాయి. ట్రైలర్‌ రోడ్డుకు అడ్డంగా ఉండిపోవడంతో పక్కనే ఉన్న కొండ రాళ్లను పగులగొట్టి వాహన రాక పోకలకు అవకాశం కల్పించారు. కార్యక్రమంలో సాలూరు అగ్నిమాపక దళ సిబ్బందితో పాటు సాలూరు, పాచిపెంట పోలీసులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు