ఉపాధి కోసం వచ్చి మృత్యుఒడిలోకి..

4 Sep, 2016 00:29 IST|Sakshi
భీమడోలు: జాతీయ రహదారి భీమడోలు కనకదుర్గమ్మ ఆలయం వద్ద శనివారం మోటార్‌ బైక్‌ను లారీ ఢీకొట్టిన ఘటనలో వస్త్ర వ్యాపారి డొక్కల రమణ (30) మృతి చెందగా మరో వ్యా పారి గడిదేసి సింహాచలంకు తీవ్ర గాయాల య్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. ఏలూరు పత్తేబాదకు చెందిన గడిదేసి సింహాచలంతో పాటు ఏటిగట్టుకు చెందిన  డొక్కల రమణ మోటార్‌ సైకిల్‌పై దుస్తులను విక్రయించేం దుకు భీమడోలు వచ్చారు. తిరిగి ఏలూరు వెళుతుండగా భీమడోలు రైల్వే గేటు దాటి కనకదుర్గమ్మ ఆలయం వైపు వెళుతుండగా ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం వైపు అతివేగంగా వెళ్తున్న పశ్చిమబెంగాల్‌కు చెందిన టమాటా లోడు లారీ వీరిని ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న రమణ, సింహాచలంకు తీవ్రగాయాలయ్యాయి. బైక్‌ వెనుక కూర్చున రమణ తలకు బలమైన గాయం కావడంతో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి అక్కడి నుంచి విజయవాడ తరలించగా మృతి చెందారు. సింహాచలం ఏలూరులో చికిత్స పొందుతున్నారు. భీమడోలు ఎస్సై బి.వెంకటేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
 
 

 

మరిన్ని వార్తలు