రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

12 Aug, 2016 22:52 IST|Sakshi

మల్యాల: ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు స్టేజీ వద్ద అతివేగంగా వెళ్తున్న ఓ వ్యాన్‌ నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్‌ నుండి జగిత్యాల వెళ్తున్న డీసీఎం వ్యాన్‌ కొండగట్టు వద్ద సబ్‌కంట్రోల్‌ రూం నుంచి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న గుర్తు తెలియని వ్యక్తిని ఢీకొట్టింది. సుమారు 20 మీటర్ల మేర మృతదేహాన్ని లాక్కెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వ్యాన్‌ డ్రైవర్, క్లీనర్‌ పరారీలో ఉన్నారు. మృతుడు మానకొండూరు మండలానికి చెందిన వ్యక్తిగా స్థానికులు అనుమానిస్తున్నారు. పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


సబ్‌కంట్రోల్‌ రూం ఉన్నా ఫలితం శూన్యం
కొండగట్టు పుణ్యక్షేత్రానికి నిత్యం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో స్థానికంగా ట్రాఫిక్‌ను నియంత్రించడంతోపాటు, ప్రజలకు పోలీసులు మరింత అందుబాటులో ఉండేందుకు 2013లో అప్పటి ఎస్సీ శివకుమార్‌ పోలీస్‌ సబ్‌కంట్రోల్‌ రూం ప్రారంభించారు. అడపాదడపా సబ్‌కంట్రోల్‌ రూం తీస్తున్నప్పటికీ దాదాపు ఏడాదికాలంగా మూలనపడింది. స్థానికంగా పోలీసులు లేకపోవడంతో వాహనాల వేగానికి అడ్డుకట్టవేసేవారు కరువయ్యారు.
 

మరిన్ని వార్తలు