దైవ దర్శనానికి వెళ్లి వస్తూ అనంత లోకాలకు..

23 Jan, 2017 01:56 IST|Sakshi
దైవ దర్శనానికి వెళ్లి వస్తూ అనంత లోకాలకు..
ఆచంట: దైవ దర్శనానికి వెళ్లి మోటారు సైకిల్‌పై ఇంటికి తిరిగి వస్తుం డగా రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం పాలుకాగా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. పోడూరుకు చెం దిన కేతా సాయిబాబు (20) అక్కడికక్కడే మృతి చెందగా అదే గ్రామానికి చెందిన చెల్లబోయిన త్రిమూర్తులు, ఇళ్ల హనుమంతుకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు పాలకొల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వివరాలిలా ఉన్నాయి.. పోడూరు పల్లపువీధికి చెందిన పలువురు జట్టు కార్మికులు ఏటా సార్వా, దాళ్వా సీజన్‌ ముగిసిన తర్వాత అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీ ర్చుకుంటుంటారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆచంట మండలం పెదమల్లంలోని మాచేనమ్మవారి ఆలయానికి సుమారు 20 మంది బయలుదేరి వెళ్లారు. వీరిలో కొందరు ట్రాక్టరుపైన, మరికొందరు మోటారు వాహనాలపై చేరుకున్నారు. అమ్మవారికి మొక్కులు సమర్పించుకుని, అక్కడే భోజనాలు చేసి గోదావరి ఏటిగట్టున ఉల్లాసంగా గడిపారు. మృతుడు సా యిబాబుతోపాటు ఇద్దరు క్షతగాత్రు లు మోటారు సైకిల్‌పై తిరుగుపయనమయ్యారు. సాయిబాబా బైక్‌పై మధ్యలో కూర్చున్నాడు. ఆచంట–మార్టేరు రోడ్డులోని నక్కల డ్రెయిన్‌ వంతెన సమీపంలోకి వచ్చే సరికి వాహనం అదుపు తప్పి వంతెన సైడ్‌ వాల్‌ను ఢీకొట్టింది. దీంతో సాయిబాబా అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మితి మీరిన వేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. క్షతగాత్రులను 108లో పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిం చారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు ఆచంట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
 
కుమారులిద్దరూ రోడ్డు ప్రమాదాల్లోనే..
పోడూరుకు చెందిన కేతా ఏడుకొం డలు, భూలక్ష్మి వ్యవసాయ కూలీలు. వారికి ఇద్దరు కుమారులు, కుమార్తె. అవివాహితులైన కుమారులు జట్టు పనులు చేస్తుండేవారు. కుమార్తెకు వివాహమైంది. ఏడుకొండలు పెద్ద కుమారుడు గరగయ్య ఎనిమిది నెలల క్రితం పోడూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఇప్పుడు చిన్న కుమారుడు సాయిబాబా రోడ్డు ప్రమాదంలోనే కన్నుమూయడంతో కుటుంబం తల్లడిల్లిపోతోంది. సాయిబాబా మృతితో పల్లపు వీధిలో విషాదఛాయలు అలముకున్నాయి. 
 
మరిన్ని వార్తలు