పట్టుబడిన.. ఘరానా మోసగాళ్లు

18 Dec, 2016 23:55 IST|Sakshi
= 12 మంది దొంగల అరెస్ట్‌ వివరాలు వెల్లడించిన 
జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు  
= 1.30 కిలోల బంగారు, భారీగా వెండి స్వాధీనం  
= మడకశిరలో వృద్ధురాలు భారతమ్మ హత్యకేసు ఛేదింపు  
అనంతపురం సెంట్రల్‌ :  దొంగ తనాలు, దోపిడీలు, అడ్డొస్తే హత్యలకు సైతం వెనుకాడని కరుడుగట్టిన ఘరానా మోసగాâýæ్లను జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనేక కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న 12 మంది దొంగలను అరెస్ట్‌ చేసి, వారి వద్ద నుంచి 1.30 కిలోల బంగారు ఆభరణాలు, 12.6 కిలోల దేవుడి వెండి వస్తువులు, ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఏడాది క్రితం మడకశిరలో సంచలనం రేకిత్తించిన వృద్ధురాలు భారతమ్మ హత్యకేసును కూడా ఛేదించారు. నిందితులను వివరాలను జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు పోలీసు కాన్ఫరె¯Œ్స హాలులో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.  

ఆలయాల్లో చోరీలకు పాల్పడే ముఠా అరెస్ట్‌..
ఆలయాలను టార్గెట్‌గా చేసుకొని దొంగతనాలకు పాల్పడే ముఠాను బుక్కరాయసముద్రం, సీసీఎస్‌ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్‌ చేశారు. కళ్యాణదుర్గం మండలం తూర్పుకోడిపల్లికి చెందిన కావడి రామన్న, కావడి వీరేష్‌లు తండ్రీకొడుకులు. ఉరవకొండ మండలం రాకెట్లకు చెందిన సుదప్పతో కలిసి    ముగ్గురు ముఠాగా ఏర్పడి ఆలయాల్లో దేవుడి సొమ్ము కొల్లగొట్టడమే వృత్తిగా పెట్టుకున్నారు.

బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి, కదిరి పట్టణం పుల్లలరేవు, పెద్దపప్పూరు, తాడిపత్రి, పుట్లూరులోని ఆలయాలతో పాటు విశాఖపట్నం కసినికోటలో ఓ ఆలయంలో చోరీకి పాల్పడ్డారు. మొత్తం 10 కేసుల్లో వీరు నిందితులు. వీటిలో ఏడు ఆలయాల్లో చోరీ కేసులే ఉన్నాయి. నేరస్తులపై నిఘా ఉంచిన పోలీసులు ఆదివారం బుక్కరాయసముద్రం మండలం కొట్టాలపల్లి వద్ద ఉన్న ముగ్గురినీ అరెస్ట్‌ చేసి, వారి నుంచి 12.6 కిలోల వెండి దేవుడి ఆభరణాలు, 3.6 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇందులో కావడి రామన్న అనే దొంగపై 35 కేసులు ఉన్నాయి.  
 
తాళం వేసిన ఇళ్లకు కన్నం వేసే దొంగలు అరెస్ట్‌  
జల్సాలకు అలవాటు పడి దొంగలుగా అవతారమెత్తిన నలుగురుని హిందూపురం టూటౌ¯ŒS పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి రూ.8 లక్షలు విలువైన 26.6 తులాల బంగారు నగలు స్వాదీనం చేసుకున్నారు. పరిగి మండలం పెద్దిరెడ్డిపల్లికి చెందిన నరసింహమూర్తి, రమేష్‌ అలియాస్‌ రమ్మీ, దాసరి బాలాజీ, హిందూపురం పట్టణం బాపూజీ నగర్‌కు చెందిన సాకే కామరాజులు ముఠాగా ఏర్పడి, తాళం వేసిన ఇళ్లలో నేరాలకు పాల్పడేవారు. నరసింహమూర్తిపై అనేక కేసులు ఉన్నాయి. అంతర్రాష్ట్ర దొంగతనాలతో పాటు ద్విచక్ర వాహనాలు, సైకిళ్లు దొంగతనాలు చేశాడు. అన్నింటికంటే పరిగి పోలీస్‌స్టేçÙ¯ŒS పరిధిలో ఓ మైనర్‌ బాలికపై అత్యాచారం కేసు కూడా ఉంది. హిందూపురం పోలీసులు పక్కా సమాచారంతో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.  
 
భారతమ్మ హత్య కేసు ఛేదింపు...
డబ్బుల కోసం హత్యలు, చై¯ŒS స్నా చిం గ్‌లు, ఇళ్లలో దొంగతనాలకు పాల్పడే ఘరానా దొంగల ముఠాను పెనుకొండ సబ్‌ డివిజ¯ŒS పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి కిలో బంగారు ఆభరణాలు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. మడకశిరలోనే కాకుండా జిల్లాలోనే సంచలనం రేకిత్తించిన వృద్ధురాలు భారతమ్మ హత్యకేసులో వీరు నింది తు లు. కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్‌ జిల్లా నగSరిగెరకు చెందిన నాగరాజు అలియాస్‌ ముత్యాలు, రామగిరి చెందిన ము త్యాలప్ప అలియాస్‌ మూగోడు, మల్లికార్జున, గుజ్జల రమేష్,  పరిగి మండలం చిన్నపల్లికి చెందిన రాజప్ప అలియాస్‌ ఎర్రోడు ముఠాగా ఏర్పడి డబ్బుల కోసం ఎంతౖకెనా తెగించేవారు.

గతేడాది డిసెంబర్‌ 3న మడకశిరలో న్యాయశాఖ విశ్రాం త ఉద్యోగి సత్యనారాయణగుప్త భార్య భారతమ్మను దారుణంగా హతమర్చారు. ఈ ఇంట్లో భారీగా డబ్బులు, నగలు ఉం టాయని భావించి, పథకం ప్రకారం వృద్ధురాలి ఇంట్లోకి చొరబడి కత్తితో గొంతు కోసి కిరాతకంగా హత్య చేశారు. అరెస్ట్‌ అయినవారిలో నాగరాజుకు నేర చరిత్ర ఉంది.  2006లో ధర్మవరం పట్టణంలో సంచలనం సృష్టించిన దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడు.  ఇతనిపై 20 కేసులు ఉన్నాయి. 2008 సెప్టెంబర్‌ 23న మడకశిర మండలం బుళ్లసముద్రం సమీపంలో జరిగిన హత్య కేసులోనూ నిందితుడు.

వీటితోæ పాటు మూడు చై¯ŒS స్నాచింగులు, 10 ఇళ్లలో తా ళాలు పగలగొట్టి దొంగతనాలకేసులు ఉ న్నాయి. పోలీసులు మడకశిర– పెనుకొండ రహదారిలో చౌటిపల్లి క్రాస్‌ వద్ద నిందితులను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. దొంగలను పట్టుకోవడంతో ప్రతిభ కనబర్చిన పెనుకొండ డీఎస్పీ సుబ్బారావు, సీసీఎస్‌ డీఎస్పీ నాగసుబ్బన్న, మడకశిర సీఐ దేవానంద్, హిందూపురం టూటౌ¯ŒS సీఐ మధుభూ షణ్‌ పెనుకొండ సబ్‌ డివిజ¯ŒS టాస్క్‌ ఫోర్సు ఎస్‌ఐ ఆంజనేయులు, బుక్కరా యసముద్రం ఎస్‌ఐ విశ్వనాథ్‌చౌదరి, పోలీసులను ఎస్పీ అభినందించారు.
 
మరిన్ని వార్తలు