నిడమర్రు హైస్కూల్‌లో చోరీ

7 Nov, 2016 00:24 IST|Sakshi
నిడమర్రు : స్థానిక గాదిరాజు గోపాలకృష్ణంరాజు జెడ్పీ హైస్కూల్‌లో దొంగలుపడి కంప్యూటర్‌ పరికరాలు చోరీ చేశారు. స్థానికులు, ఉపాధ్యాయులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో హైస్కూల్‌ వద్దకు కారు, రెండు మోటార్‌ సైకిళ్లు వచ్చినట్టు స్థానికులు గుర్తించారు. కొద్దిసేపటికి ప్రధాన గేటు తాళం బద్దలు కొట్టి గుర్తుతెలియని వ్యక్తులు లోనికి ప్రవేశించారు. ఇనుప మెస్, ల్యాబ్‌ తాళాలు పగులకొట్టారు. ల్యాబ్‌లోని 12 ఎల్‌ఈడీ మోనిటర్లు, 3 సీపీయూలు, యూపీఎస్‌లు, కీబోర్డులు, మౌస్‌లు, సీలింగ్‌ ఫ్యా¯ŒSలు అపహరించారు. అనంతరం పాఠశాల ఆవరణలోని భవిత భవనం తలుపుల తాళాలు బద్దలు కొట్టి కంప్యూటర్‌ సామగ్రితో పాటు ఫిజియోథెరపీ సైకిల్‌ను కూడా అపహరించారు. దీంతో హెచ్‌ఎం వి.శ్రీరామకృష్ణ, ఎంఈవో పి.పాండురంగారావు, ఐఈఆర్టీ టీచర్‌ ఏసురాజు నిడమర్రు పోలీస్‌స్టేçషన్‌లో ఫిర్యాదు చేశారు. మొత్తం రూ.3 లక్షల విలువైన చోరీ జరిగినట్టు అంచనా.  
 
మరిన్ని వార్తలు