విన్నర్ హోటల్లో చోరీ

6 Aug, 2015 08:57 IST|Sakshi

నల్లగొండ : నల్గొండ పట్టణం భాస్కర్ టాకీస్ సమీపంలోని విన్నర్ హోటల్లో బుధవారం రాత్రి చోరీ జరిగింది. ఆ విషయాన్ని గురువారం ఉదయం గుర్తించిన హోటల్ యజమాని నర్సింహులు పోలీసులను ఆశ్రయించి... ఫిర్యాదు చేశారు. పోలీసులు హోటల్కు చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సుమారు రూ. 30 వేల విలువైన రెండు గ్యాస్ సిలిండర్లు, వంట సరుకులతోపాటు రూ. 5 వేల నగదు చోరీకి గురైనట్లు పోలీసులకు చేసిన ఫిర్యాదులో నర్సింహుల్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు