కొణితివాడ అమ్మవారి ఆలయంలో చోరీ

29 Oct, 2016 00:37 IST|Sakshi
వీరవాసరం : కొణితివాడ గ్రామంలోని కనకదుర్గమ్మ, మారెమ్మ అమ్మవార్ల ఆలయంలో శుక్రవారం తెల్లవారుజామున భారీ చోరి జరిగింది. నాలుగు కాసుల బంగారం, నాలుగు కేజిల వెండి అపహరణకు గురైంది. పోలీసుల కథనం ప్రకారం.. వీరవాసరం మండలం కొణితివాడలోని శ్రీకనకదుర్గమ్మ, మారెమ్మ అమ్మవార్ల ఆలయంలో గుర్తుతెలియని దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. తలుపులకు వేసిన తాళాలను పగలకొట్టి ఆలయంలోకి చొరబడి అమ్మవార్లకు అలంకరించిన రెండేసి జతల బంగారు మంగళసూత్రాలు, కేజీ వెండి కిరీటం, మరో మూడు కేజీల ఆభరణాలు దొంగిలించుకుపోయారు. తెల్లవారుజామునే వచ్చిన ఆలయ అర్చకుడు సుబ్రహ్మణ్యశాస్త్రి గుడి తలుపులు పగలకొట్టి ఉండడంతో పరిసర ప్రాంతాల వారిని పిలిచి వీరవాసరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా ప్రాంతాన్ని వీరవాసరం ఎసై ్స ఎన్‌.శ్రీనివాసరావు, క్లూస్‌ టీం సీఐ నర్సింహమూర్తి పరిశీలించారు. ఆలయ కమిటీ సభ్యులు నాగరాజు సత్యనారాయణరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వీరవాసర ఎసై ్స ఎన్‌.శ్రీనివాసరావు తెలిపారు.
 
మరిన్ని వార్తలు