రోళ్లపాడు అభయారణ్యం సందర్శన

2 Mar, 2017 00:10 IST|Sakshi
 మిడుతూరు : మండలంలోని రోళ్లపాడు అభయారణ్యాన్ని నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ రీజినల్‌ అధికారి రాజేంద్ర గర్వాడ్, డీఎఫ్‌ఓ సెల్వం బుధవారం  సందర్శించారు. రీజియనల్‌ అధికారి మాట్లాడుతూ భారత ప్రభుత్వ నిధులను ఏపీలో విస్తరించిన అటవీ ప్రాంతాలకు ఎలా ఖర్చు చేయాలి, అటవీ ప్రాంతాల అభివృద్ధికి తీసుకోనున్న చర్యలపై నంద్యాల, మార్కాపురం, గిద్దలూరు, అమరావతి ప్రాంతాల్లో పరిశీలిస్తున్నట్లు  తెలిపారు. అభయారణ్యంలో సంచరిస్తున్న కృష్ణ జింకలు, వివిధ రకాల పక్షులను బైనాక్యులర్‌ సాయంతో వీక్షించారు. సాసర్‌ ఫిట్స్‌, బట్టమేకపక్షి నమూనా,  పక్షుల బోర్డులను తిలకించారు. డీఆర్‌ఓ రంగన్న, ప్రొజెక‌్షనిస్టు వాసు, బర్డ్‌ వాచర్స్‌ ఆదిశేషయ్య, గఫూర్, అల్లబకాష్, రంగస్వామి, శీలన్న పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు