‘జీవాల ఫెడరేషన్‌’కు రూ.1000కోట్లు

9 Jan, 2017 03:38 IST|Sakshi

ఖమ్మంరూరల్‌: గొర్రెల, మేకల పెంపకందారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.50కోట్లు కేటాయించిందని రాష్ట్ర గొర్రెల, మేకల అభివృద్ధి సంస్థ ఫెడరేషన్‌ చైర్మన్‌ కన్నెబోయిన రాజయ్య యాదవ్‌ అన్నారు. ఆదివారం యల్లారెడ్డి ఫంక్షన్‌హాల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గొర్రెల కాపరులను కాపరులుగా కాకుండా యజమానులుగా చేసేందుకు సీఎం కేసీఆర్‌ 20శాతం సబ్సిడీతో రుణాలు అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 14లక్షల గొర్రెల, మేకల పెంపకందారుల కుటుంబాలు ఉన్నాయని, మూడు వేల సంఘాలతో మూడు లక్షల మంది సభ్యులు ఉన్నారని తెలిపారు. భవిష్యత్‌లో కొత్తగా 4లక్షల మంది సభ్యులను చేర్పించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో రూ.450 కోట్లు గొర్రెల కాపరులకు రుణాలు అందించేందుకు నిధులు మంజూరైయినట్లు, మరో రూ.600 కోట్లు త్వరలో మంజూరు అవుతాయని తెలిపారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రూ.50కోట్లు మంజూరయ్యాయన్నారు. సభ్యులకు రూ.లక్ష రుణం ఇస్తే అందులో 20శాతం లబ్ధిదారుని వాటా, మిగిలిన రూ.60వేలు రుణం అని చెప్పారు. గొర్రెలకు రూ.173తో ఇన్సూరెన్స్‌ చేయిస్తే ప్రమాదవశాత్తు మృతి చెందిన ఒక్కో గొర్రెకు రూ.5వేల బీమా సొమ్ము వస్తుందన్నారు. రాష్ట్రంలో గతంలో ఉన్న గొర్రెల, మేకల సంతలను, మాంసం విక్రయించే మార్కెట్‌లను ఆధునీకరించి ప్రతి 50కిలోమీటర్లకు ఒక అంగడిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో గొర్రెలు, మేకలు పెంపకందారుల సంఘం జిల్లా అధ్యక్షుడు, మేకల మల్లిబాబుయాదవ్, సంఘం నాయకులు కె నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు