అహుడాకు రూ.10 కోట్లు విడుదల

14 Jun, 2017 22:28 IST|Sakshi

అనంతపురం న్యూసిటీ :  అనంతపురం, హిందూపురం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(అహుడా) ఏర్పాటుకు ప్రభుత్వం రూ.10 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు బుధవారం ప్రిన్సిపల్‌ సెక్రటరీ కరికాల వల్లవేన్‌ జీఓ 421 విడుదల చేశారు. వాస్తవంగా ఏడాదికి రూ.40 కోట్లు మంజూరు చేస్తారు. మొదటి విడతలో భాగంగా రూ.10 కోట్లు విడుదల చేశారు.

అహుడాకు కార్యాలయం, అవసరమైన సామగ్రి, వాహనాలు, ఉద్యోగులకు వేతనాల కోసం ఈ నిధులను వినియోగించనున్నారు. ప్రభుత్వం గతేడాది నవంబర్‌లో అహుడా ఏర్పాటుకు జీఓ 279 విడుదల చేసిన విషయం విదితమే. అనంతపురం, హిందూపురంలోని 18 మండలాలకు సంబంధించి 180 గ్రామాలు అహుడా పరిధిలోకి వస్తాయి. అహుడా విస్తీర్ణం 3,120 చదరపు కిలోమీటర్లు. అహుడా పనులు వేగవంతం చేసేందుకే కమిషనర్‌గా ఉన్న పీవీవీఎస్‌ మూర్తికి అహుడా వైస్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారు. ఈ  పనులు ఏ మేరకు వేగవంతం చేస్తారో వేచి చూడాలి.

మరిన్ని వార్తలు