రూ.1,100కోట్ల రాయితీ రుణాలు

12 Dec, 2016 14:55 IST|Sakshi
రూ.1,100కోట్ల రాయితీ రుణాలు
  •  ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ జూపూడి ప్రభాకర్‌రావు
  • నెల్లూరు రూరల్‌ : ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా 99,464 మందికి రూ.1,100 కోట్ల రాయితీ రుణాలను అందిస్తున్నట్లు చైర్మన్‌ జూపూడి ప్రభాకర్‌రావు అన్నారు.  మంగళవారం మినిబైపాస్‌ రోడ్డులోని టీడీపీ నేత ఆదాల ప్రభాకర్‌రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో  ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ప్రభుత్వ పథకాల ప్రచారం నిర్వహించి, వారిని టీడీపీలో చేర్చేందుకు ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ 125వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దళితులను మోసం చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నిస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో లక్షమంది యువకుల స్కిల్స్‌ డెవలప్‌మెంట్‌కు  ప్రత్యేక శిక్షణ ఇచ్చి, ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం సీఎం రీలీఫ్‌ ఫండ్‌ చెక్కును బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, జిల్లా పరిశీలకుడు నరసింహయాదవ్, విజయ డైయిరీ చైర్మన్‌ కొండ్రెడ్డి రంగారెడ్డి, ఆనం జయకుమార్‌రెడ్డి, స్వర్ణా వెంకయ్య పాల్గొన్నారు.
     
     
     
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు