రూ.149కే ఏపీ ఫైబర్‌ నెట్‌

26 Dec, 2016 21:43 IST|Sakshi
  • డిప్యూటీ సీఎం చినరాజప్ప
  • వివిమెరక (సఖినేటిపల్లి) :
    ఈ నెల 29వ తేదీన సీఎం చంద్రబాబునాయుడు మోరిపోడు రివర్‌సైడు స్కూలులో ప్రారంభించనున్న ఏపీ ఫైబర్‌ నెట్‌ సౌకర్యం ద్వారా రూ.149కే మోరి, మోరిపోడు గ్రామాల్లో ప్రతి ఇంటికి ఇంటర్నెట్, టీవీ కనెక్షన్, కేబుల్‌ టీవీ సౌకర్యాలు అందుబాటులోకి రానున్నట్టు డిప్యూటీ సీఎం, హోం శాఖామంత్రి ఎ¯ŒS.చినరాజప్ప తెలిపారు. సోమవారం వివిమెరకలో సీఎం సభ విజయవంతానికై రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి టీడీపీ కార్యకర్తలు, నాయకులతో సమావేశం జరిగింది. సమావేశంలో డిప్యూటీ సీఎం చినరాజప్ప ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ఆప్టికల్‌ ఫైబర్‌ టెక్నాలజీ ద్వారా వేగమైన, స్పష్టత కలిగిన ప్రసారాలను ఈ నెట్‌ సౌకర్యం ద్వారా అందజేయనున్నట్టు వెల్లడించారు. సీఎం సభ విజయవంతానికి ప్రతి కార్యకర్త జనసమీకరణపై దృష్టి పెట్టాలని సూచించారు. రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ రివర్‌సైడు స్కూలు ఫౌండర్, బెర్క్‌లీ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సాల్మ¯ŒS డార్వి¯ŒS కృషితో స్మార్ట్‌విలేజస్‌గా ప్రభుత్వం ప్రకటించిన మోరి, మోరిపోడు గ్రామాల్లో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు 12 బహుళ జాతీయ కంపెనీలు రానున్నట్టు వెల్లడించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అంతర్వేదిలో డ్రెడ్జింగ్‌ హార్బర్‌కు సీఎం శంకుస్థాపన చేయనున్నారని, శంకరగుప్తంలో డాక్టరు మంగళంపల్లి బాలమురళీకృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్టు పేర్కొన్నారు. జెడ్పీ చైర్మ¯ŒS నామన రాంబాబు, ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు, మాజీ డిప్యూటీ స్పీకర్‌ ఏవీ సూర్యనారాయణరాజు, టీడీపీ రాష్ట్ర ప్రతినిధులు పెచ్చెట్టి చంద్రమౌళి, గేదెల వరలక్ష్మి, ధవళేశ్వరం వాటర్‌ డిస్ట్రిబ్యూటరీ కమిటి చైర్మ¯ŒS ఈశ్వరరాజు వర్మ, రాజోలు సబ్‌డివిజ¯ŒS నీటి సంఘ చైర్మ¯ŒS ఓగూరి విజయ్‌కుమార్, రాజోలు టీడీపీ నియోజకవర్గ ఇ¯ŒSచార్జ్‌ బత్తుల రాము, మోరి చేనేత సొసైటీ అధ్యక్షుడు చింతా వీరభద్రేశ్వరరావు, రాజోలు ఏఎంసీ చైర్మ¯ŒS కాండ్రేగుల సత్యనారాయణమూర్తి, రాష్ట్ర రైతు ప్రతినిధి బోణం నాగేశ్వరరావు, పలు ప్రాంతాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.   
     
మరిన్ని వార్తలు