షాపులో రూ.15 లక్షల చోరీ

29 Jul, 2016 22:34 IST|Sakshi
షాపులో రూ.15 లక్షల చోరీ
 
గుంటూరు ఈస్ట్‌ : షాపు తాళాలు పగులకొట్టి రూ.15 లక్షల నగదు చోరీ చేసిన సంఘటన గురువారం రాత్రి పల్లవి థియేటర్‌ సమీపంలోని సాంబశివపేటలో చోటుచేసుకుంది. కొత్తపేట ఎస్‌హెచ్‌వో వెంకన్న చౌదరి కథనం మేరకు....సాంబశివ ఇంజినీరింగ్‌ వర్క్‌షాపు యజమాని పామర్తి సాంబశివరావు గురువారం రాత్రి షాపుకు తాళం వేసి ఇంటికి వెళ్లాడు. శుక్రవారం ఉదయం షాపునకు వచ్చి చూసేటప్పటికి షాపు తాళాలు పగులకొట్టి ఉన్నాయి. షాపులో పరిశీలించగా కౌంటర్‌ తాళాలు పగులకొట్టి  అందులోని రూ. 15 లక్షలు చోరీకి గురయినట్లు గుర్తించాడు. దీంతో సాంబశివరావు కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అడిషనల్‌ ఎస్పీ తిరుపాల్, డీఎస్పీ సంతోష్‌ కుమార్, ఎస్‌హెచ్‌వో వెంకన్న చౌదరి, క్లూస్‌ టీమ్‌ షాపును పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  రాత్రి గస్తీలో ఉన్న సీసీఎస్‌ సీఐ తన విధులు సక్రమంగా నిర్వహింలేదన్న సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు సీఐని అతని జీపు డ్రై వర్‌ను విచారిస్తున్నట్లు సమాచారం. సీఐ జిన్నాటవర్‌ సెంటర్‌లోని ఓ ఏటీఎమ్‌లో రాత్రి నిద్రించినట్లు సమాచారం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఆ కోణంలోనూ విచారిస్తున్నట్లు తెలిసింది. 
 
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధం 

నారాజ్‌ చేయొద్దు

అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌

కాంట్రాక్ట్‌ కార్మికులందరికీ బోనస్‌ చెల్లించాలి

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ : 10 మందికి గాయాలు

సినిమా

భార్య, పిల్లలు విదేశాల్లో చిక్కుకుపోయారు: విష్ణు

ఈ పాటను చేతులు కడుక్కొని వినండి!

ఇంటి ప‌ని చేస్తూ ఏడ్చేసిన‌ న‌టి

‘దారుణం, అత‌డి ప్ర‌తిభ‌ను కొట్టేశారు’

న‌యా ట్రెండ్ సృష్టిస్తోన్న ‘ఆహా’

సింగ‌ర్‌కు ఐదోసారీ క‌రోనా పాజిటివ్‌