పీటీపీకి రూ.22 కోట్ల నిధులు

23 Mar, 2017 01:42 IST|Sakshi
పెంటపాడు: మేలుజాతి పశువుల అభివృద్ధి పథకానికి (పీటీపీ) ప్రభుత్వం రూ.22 కోట్ల నిధులు అందించనున్నట్టు జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్‌ పాకలపాటి గాంధీ తెలిపారు. పెంటపాడులో గోపాలమిత్ర సూపర్‌వైజర్ల సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఐదేళ్ల ప్రోగ్రాంలో భాగంగా పలు జిల్లాలకు ఉపయోగపడేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించిందన్నారు. దీనిలో భాగంగా గ్రామాలను దత్తత తీసుకుని ఎక్కువ పాలనిచ్చే ముర్రాజాతి ఆవులు, గిత్తల యజమానులను ప్రోత్సహిస్తామన్నారు. రాష్ట్రంలోనే ఇతర జాతులను అభివృద్ధి చేయడమే పథకం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. జిల్లాలో 15 జాతుల స్వదేశీ పశువులతో కామధేను పథకం, రూ.10 కోట్ల నిధులతో సంచార  వైద్యశాలల అభివృద్ధి పనులను వచ్చేనెలలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. గోపాలమిత్రల సంఘ అధ్యక్షుడు వి.సుబ్బారాయుడు, సాయిబాబు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు