‘ఇందిరమ్మ’ అక్రమాల్లో 2 వేల మందికి జైలే!

31 Oct, 2015 03:05 IST|Sakshi
‘ఇందిరమ్మ’ అక్రమాల్లో 2 వేల మందికి జైలే!

రూ. 350 కోట్ల దుర్వినియోగం: హరీశ్

 సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల అక్రమాలపై సీబీసీఐడీ చేసిన ప్రాథమిక విచారణలో రూ.350 కోట్ల నిధులు దుర్వినియోగమైనట్లు తేలిందని భారీ నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. ఈ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటే 2 వేల మంది జైలుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డిలో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్లపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశిస్తే మరింత అవినీతి బయటకి వచ్చే అవకాశం ఉందని హరీశ్ అన్నారు. వారం రోజుల్లో హైదరాబాద్‌కు గోదావరి, కృష్ణా నదుల నుంచి నీళ్లు తరలిస్తామని పేర్కొన్నారు. ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలో మిషన్‌కాకతీయ పథకం తొలివిడత ఫలాలు అందాయని, ఖమ్మం జిల్లాలో అత్యధికంగా ఐదు లక్షల ఎకరాల ఆయకట్టు సాగు చేసినట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు