రూ. 6 లక్షల సరుకు సీజ్‌

22 Sep, 2016 23:23 IST|Sakshi

గార్లదిన్నె : కల్లూరులో గురువారం విజిలెన్స్‌ అధికారులు ఫర్టిలైజర్‌ షాపులపై ఆకస్మీక దాడులు చేశారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయాధికారి శ్రీనాథ్‌రెడ్డి మాట్లాడుతూ విజిలెన్స్‌ ఎస్‌ఐ రామక్రిష్టయ్య, విజిలెన్స్‌ ఏఓ ఉమాపతి కల్లూరులోని కేశవ కెమికల్స్‌ అండ్‌ ఫర్టిలైజర్‌ షాపుపై దాడులు నిర్వహించారన్నారు.

షాపులో స్టాక్‌ రిజిష్టర్, షాపులో ఉన్న సరుకులకు తేడా ఉండటంతో పాటు రికార్డులు సక్రమంగా లేక పోవడంతో దాదాపు రూ.6.85 లక్షలు విలువ చేసే సరుకులు సీజ్‌ చేశామన్నారు. మండల విస్తారణ అధికారి మధుకర్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు