'రాష్ట్రానికి కేంద్రం రూ. లక్ష కోట్ల బడ్జెట్ కేటాయింపు'

10 Feb, 2016 16:58 IST|Sakshi

నల్గొండ : తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జె.పి. నడ్డా స్పష్టం చేశారు. అందులోభాగంగా తెలంగాణకు మోదీ సర్కార్ రూ.లక్ష కోట్ల బడ్జెట్ కేటాయించిందని తెలిపారు. బుధవారం నల్గొండలో జె.పి.నడ్డా విలేకర్లతో మాట్లాడుతూ..  ఎంఎంటీఎస్ రైలు సర్వీసు యాదాద్రి వరకు పొడిగించే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. మూసీ నదీ ప్రక్షాళనకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి పరిశోధక బృందాలను పంపించి శుద్ధి చేయిస్తామని వెల్లడించారు.

మరిన్ని వార్తలు