ఆర్టీసీలో ఎన్నికల సందడి

12 Dec, 2016 15:02 IST|Sakshi
ఆర్టీసీలో ఎన్నికల సందడి

సాక్షి,అమరావతి బ్యూరో : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఎన్నికల సందడి మొదలయింది. గుర్తింపు ఎన్నికలు ముగిసిన తర్వాత తొలిసారిగా ఆర్టీసీలో కో–ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ(సీసీఎస్‌) ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 16న జరిగే ఎన్ని కలకు నామినేషన్ల పర్వం ఊపందుకుంది. ఈ నెల 2 నుంచి 8వ తేదీ వరకు నామినేషన్ల దాఖలు, 9న పరిశీలన, 10 నుంచి 13వ తేదీ వరకు ఉపసంహరణ జరుగు తుంది. ఈ ఎన్నికల్లో విజయం కోసం యూనియ¯ŒS నేతలు వ్యూహప్రతివ్యూహా లతో ఎన్నికల వేడి పెంచారు.
ఐదేâýæ్లకోసారి జరిగే ఈ ఎన్నికల్లో ఈయూ, ఎస్‌డబ్యూఎఫ్‌ మిత్రపక్షంగా, ఎ¯ŒSఎంయూ యూనియ¯ŒS స్వతంత్రంగా బరిలోకి దిగుతున్నాయి. టీఎ¯ŒSటీయూసీ అనుబంధ కార్మిక సంఘం కార్మికపరిషత్‌ మాత్రం అటూ ఈయూతో, ఇటు ఎ¯ŒSఎంయూలతో అవసరమైన ప్రాతిపదికన పొత్తులు పెట్టుకుంటోంది. ఈ ఎన్నికలను ఆ యూనియన్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 127 డిపోలు, 5 వర్క్‌ షాపులు, ఒక అడ్మినిసే్ట్రటివ్‌ ఆఫీసు పరిధిలోని 245 కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి రీజియన్ల పరిధిలో ఎన్నికల వేడి పుంజుకొంది.
58 మంది డెలిగేట్స్‌ ఎన్నిక
కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి రీజియన్ల పరిధిలో సీసీఎస్‌ సభ్యులుగా ఉన్న 14,337 మంది ఈ ఎన్నికల్లో పాల్గొని 58మంది డెలిగేట్స్‌ను ఎన్నుకోవాలి. అమరావతి పరిధిలో ఉన్న కృష్ణా రీజియ¯ŒS పరిధిలో 26 మంది, గుం టూరు రీజియ¯ŒS పరిధిలో 22 మందిని డెలిగేట్స్‌ను ఎన్నుకోవాలి. విజయవాడ జో¯ŒS పరిధిలో ఉన్న పశ్చిమ గోదావరి రీజియ¯ŒS పరిధిలో 10 మందిని ఎన్నుకోవాలి. ఈ డెలిగేట్స్‌ అంతా కలిసి 9 మందితో కూడిన పాలకవర్గాన్ని ఈనెల 30వ తేదీన ఎన్నుకుంటారు. ప్రస్తుతం ఎంప్లాయీస్‌ యూనియ¯ŒS (ఈయూ) నేతృత్వంలో పాలకమండలి పనిచే స్తోంది. ఆర్టీసీ కార్మికుల కోసం పనిచేసే ఈ సొసైటీ వెయ్యికోట్ల రూపాయల టర్నోవర్‌తో పనిచేస్తుంది. పూర్తి స్థాయి ఆర్థిక లావాదేవీలు ముడిపడి ఉన్న కో– ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ (సీసీఎస్‌) ఆర్టీసీ ఉద్యోగులకు, కార్మికులకు వ్యక్తిగత, విద్య, ఇంటి నిర్మాణం, తదితర అవసరాలకు అవసరమైన రుణాలు అందిస్తారు.
ఆ రెండు యూనియన్ల మధ్యే పోటీ
ఆర్టీసీ సీసీఎస్‌ ఎన్నికల్లో ఈయూ, ఎస్‌డబ్యూఎఫ్, కార్మిక పరిషత్‌తో కూటమికట్టి బరిలోకి దిగుతున్నాయి. గత గుర్తింపు ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గుర్తింపు తెచ్చుకున్న ఎ¯ŒSఎంయూ స్వతంత్రంగా బరిలోకి దిగుతోంది. అటు కూటమితో ఎలాగైనా సీసీఎస్‌ను కైవసం చేసుకోవాలని ఈయూ ఉవ్విళ్లూరుతోంది.
31 నామినేషన్లు దాఖలు
కృష్ణా రీజయ¯ŒS పరిధిలో 26 మంది డెలిగేట్స్‌ ఎన్నికకు రెండు రోజులుగా 17 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో ఎ¯ŒSఎంయూ తరుఫున 12, ఎంప్లాయీస్‌ యూనియ¯ŒS తరుఫున 5 నామినేషన్లు వేశారు. గుంటూరు రీజియ¯ŒS పరిధిలో 22మంది డెలిగేట్స్‌కు 14 నామినేషన్లు దాఖలుచేశారు. ఎ¯ŒSఎంయూ నుంచి 10, ఎంప్లాయీస్‌ యూనియ¯ŒS నుంచి 4 నామినేషన్లు దాఖలయ్యాయి.   
 

 

మరిన్ని వార్తలు