ఆర్టీసీ ఒక్క రోజు ఆఫర్‌!

6 Sep, 2017 13:14 IST|Sakshi
ఆర్టీసీ ఒక్క రోజు ఆఫర్‌!

ఆర్డినరీ పాసులతో మెట్రో బస్సుల్లో ప్రయాణం
సీఎం సభకు బస్సులు పంపుతున్న ఫలితం


సాక్షి, విశాఖపట్నం : ప్రయాణికులకు ఆర్టీసీ ఒక్కరోజు ఆఫర్‌ ప్రకటించింది. బుధవారం ఆర్డినరీ బస్‌పాస్‌లున్న వారు మెట్రో ఎక్స్‌ప్రెస్‌ల్లోనూ ప్రయాణించేందుకు అనుమతించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాలోని కశింకోట మండలం గొబ్బూరులో జరిగే జలసిరి కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

అక్కడ జరిగే సభకు జనాన్ని తరలించడానికి సుమారు 200 ఆర్టీసీ బస్సులను తీసుకున్నారు. వీటిలో వంద బస్సులు విశాఖ రీజియన్‌ నుంచి పంపుతున్నారు. అందువల్ల నగరంలో బస్‌పాసులున్న ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా మెట్రో బస్సుల్లో ఎక్కినా అదనపు కాంబీ టిక్కెట్టు చార్జీ చెల్లించనవసరం లేకుండా అనుమతించనున్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ జి. సుధేష్‌కుమార్‌ కోరారు.

మరిన్ని వార్తలు