ఆర్టీసీకి ‘చిల్లర’ దెబ్బ

15 Nov, 2016 03:11 IST|Sakshi
ఏలూరు (ఆర్‌ఆర్‌ పేట) : పెద్దనోట్ల రద్దు ప్రభావం ఆర్టీసీపైనా పడింది. చిల్లర కొరత, రూ.500, రూ.1000 నోట్లు మార్చుకోవడానికి బ్యాంకుల ఎదుట క్యూ కట్టాల్సి రావడంతో ప్రజలు ప్రయాణాలను విరమించుకుంటున్నారు. ఫలితంగా జిల్లాలో ఆర్టీసీకి రోజుకు రూ.8 లక్షల వరకూ ఆదాయ నష్టం వాటిల్లుతోంది. కార్తీక మాసంలో ఆదాయం గణనీయంగా పెరగాల్సి ఉంది. ఏటా ఈ సీజ¯ŒSలో జిల్లాలోని శైవ క్షేత్రాలు, రాష్ట్రంలోని వివిధ పుణ్యక్షేత్రాలకు వెళ్ళే భక్తులు అధికంగా ఉంటారు. చిల్లర కొరత కారణంగా భక్తులెవరూ పెద్దగా ప్రయాణాలు చేయడం లేదు. సమీపంలోని శివాలయాలను దర్శించుకుని సరిపెడుతున్నారు. అయ్యప్ప మాలధారులు సైతం ప్రయాణాల విషయంలో ఆసక్తి చూపడం లేదు. ఆర్టీసీకి సాధారణ రోజుల్లో వచ్చే ఆదాయంతో పోల్చితే కార్తీక మాసంలో మరో 15 శాతం వరకూ అధికంగా ఆదాయం వస్తుంది. ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పెద్దనోట్ల ప్రభావంతో సుమారు 10 వేల మంది ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నట్టు ఆర్టీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లాలోని 8 డిపోల నుంచి తిప్పుతున్న ఆర్టీసీ సర్వీసులలో ప్రస్తుతం రోజుకు సగటున 70 వేల మంది ప్రయాణాలు చేస్తున్నారు. 10 వేల మంది ప్రయాణికులు తగ్గడంతో రోజువారీ ఆదాయం రూ.8 లక్షల వరకు తగ్గినట్టు అంచనా. కార్తీక మాసంలో రోజుకు సుమారు రూ.కోటి వరకు ఆదాయం సమకారాల్సి ఉండగా, ప్రస్తుతం రూ.60 లక్షల నుంచి రూ.65 లక్షలు మాత్రమే వస్తోంది. ఈ సీజ¯ŒSలో రావాల్సిన రోజువారీ ఆదా యంలో రూ.35 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు కోల్పోతోంది. సీజన్‌తో సంబంధం లేకుండా సాధారణ రోజుల్లో వచ్చే ఆదాయంతో పోలిస్తే రోజుకు రూ.8 లక్షల వరకు ఆదాయం తగ్గింది. నిత్యం 10 వేలమంది ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారని, ఈ కారణంగా రోజువారీ సగటు ఆదాయంలో రూ.7 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు గండి పడుతున్నట్టు అంచనా వేశామని ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌ ఎస్‌.ధనుంజయరావు వ్యాఖ్యానించారు.
 
మరిన్ని వార్తలు