19 నుంచి ఆర్‌యూ పీసెట్‌ కౌన్సిలింగ్‌

9 Jun, 2017 23:50 IST|Sakshi

కర్నూలు (ఆర్‌యూ): రాయలసీమ యూనివర్సిటీ పరిధిలోని కళాశాల్లో పీజీలో చేరేందుకు ఈనెల 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు   కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు పీజీ సెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ సీవీ క​ృష్ణారెడ్డి తెలిపారు.   జనరల్‌ అభ్యర్థులు రూ. 300, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు రూ. 150 ప్రకారం ఫీజు చెల్లించాల్సి  ఉంటుందన్నారు. కౌన్సెలింగ్‌కు అన్ని ఒరిజినల్‌ సర్టిఫికెట్స్‌తోపాటు రెండు సెట్ల జిరాక్స్‌ కాపీలు తీసుకోరావాలని సూచించారు.   19వ తేదీ ఉదయం – ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్, కంప్యూటర్‌ సైన్స్, మధ్యాహ్నం – బోటని, బయోటెక్నాలజీ, 20న ఉదయం – కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, డెటా సైన్స్, మధ్యాహ్నం – ఇంగ్లిషు, స్టాటిస్టిక్స్, 21వ తేదీ ఉదయం – ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, మధ్యాహ్నం – ఫిజిక్స్, ఫిజికల్‌ ఎడ్యుకేషన్, 22వ తేదీ ఉదయం – జువాలజీ, మైక్రో బయాలజీ, మధ్యాహ్నం – తెలుగు, 23వ తేదీ ఉదయం – మ్యాథ్స్, మధ్యాహ్నం – మ్యాథ్స్, కామర్స్,  24వ తేదీ ఉదయం – మ్యాథ్స్, మధ్యాహ్నం – మ్యాథ్స్, 25వ తేదీ   ఉదయం –   సైన్స్‌ సబ్జెక్టులు, మధ్యాహ్నం –  ఆర్ట్స్‌ సబ్జెక్టుల ( ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, పీహెచ్, సీఏపీ, స్పోర్ట్స్‌ కోటాలో రిజర్వేషన్‌ కలిగిన అభ్యర్థుల )కు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని కన్వీనర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు