25 నుంచి ఆర్‌యూ పీజీ సెట్‌

13 May, 2017 23:58 IST|Sakshi
కర్నూలు(ఆర్‌యు): ఈ నెల 25 నుంచి 27వతేదీ వరకు ఆర్‌యూ పీజీ సెట్‌ నిర్వహిస్తున్నట్లు కన్వీనర్‌ సి.వి.కృష్ణారెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడుతూ పరీక్షలన్నీ కంప్యూటర్‌ ఆధారిత ఆన్‌లైన్‌ విధానంలోనే జరుగుతాయన్నారు. ప్రతిరోజు ఉదయం 8:30 నుంచి 10 వరకు, 11 నుంచి 12:30 వరకు, మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు, 4 నుంచి 5:30 గంటల వరకు ప్రతిసారీ గంటన్నర సమయంలో నిర్వహిస్తామన్నారు. జిల్లాకు సంబంధించి కర్నూలు జి.పుల్లయ్య ఇంజనీరింగ్‌ కళాశాల, వెంకాయపల్లె రవీంద్ర మహిళా ఇంజనీరింగ్‌ కళాశాల,  నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాల, ఆదోనిలోని ఆదోని ఆర్ట్స్‌ సైన్స్‌ డిగ్రీ కళాశాలల కేంద్రాలుగా పరీక్ష నిర్వహిస్తామన్నారు. 25వ తేదీన మైక్రోబయాలజీ, ఫిజికల్‌ ఎడ్యుకేషన్, భౌతిక శాస్త్రం, ఎకనామిక్స్, జువాలజీ, కంప్యూటర్‌ సైన్స్, బయోటెక్నాలజీ, తెలుగు. 26వ తేదీన మాథమేటిక్స్, బోటని, కామర్స్, 27వ తేదీన కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్, ఎడ్యుకేషన్, స్టాటిస్టిక్స్‌ (ఓఆర్, ఎస్, క్యు, సి) ఇంగ్లీషు, బయోకెమిస్ట్రీ, డాటా సైన్స్‌ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. 18 విభాగాలకు గాను 4,400 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇతర వివరాల కోసం వెబ్‌సైట్‌(www.rudoa.in/www.ruk.ac.in)లో వెబ్‌సైట్‌లో చూడవచ్చని కన్వీనర్‌ సి.వి.కృష్ణారెడ్డి తెలిపారు. 
 
 
>
మరిన్ని వార్తలు