శ్రీమఠంలో ఘనంగా రుద్రాభిషేకం

24 Feb, 2017 22:52 IST|Sakshi
శ్రీమఠంలో ఘనంగా రుద్రాభిషేకం
మంత్రాలయం :  శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో మహా శివరాత్రి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. శ్రీరాఘవేంద్రుల మూలబృందావనం బహుముఖంగా వెలసిన శివుడి లింగానికి  పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా శివలింగానికి నిర్మల్య విసర్జన, జల, క్షీరం, తైలం, సుగంధ ద్రవ్యాలు, పంచామృతాభిషేకాలు గావించారు. పండితుల వేద మంత్రోచ్ఛారణ మధ్య నిర్వహించిన పూజా విశిష్టతలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మహామంగళ హారతులతో శివ పూజలకు ముగింపు పలికారు. అనంతరం పీఠాధిపతి భక్తులకు ఫల, పూల మంత్రాక్షితలు అందజేసి ఆశీర్వదించారు. వేడుకలో మేనేజర్‌ శ్రీనివాసరావు, జోనల్‌ మేనేజర్‌ శ్రీపతి ఆచార్, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్, ద్వారపాలన అనంతస్వామి పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు