రగ్బీ విజేత కర్నూలు

12 Dec, 2016 15:21 IST|Sakshi
రగ్బీ విజేత కర్నూలు
వెంకటేశ్వరపురం (నంద్యాలరూరల్‌): రాష్ట్రస్థాయి 62వ స్కూల్‌గేమ్స్‌ అండర్‌–17 బాల బాలికల రగ్బీ పోటీల్లో కర్నూలు బాలికల జట్టు విజయకేతనం ఎగుర వేసింది. బాలుర విభాగంలో గుంటూరు జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. బాలికల విభాగంలో  నెల్లూరు జట్టు రజితం, చిత్తూరు జట్టు కాంస్య పతకాలు, బాలుర విభాగంలో నెల్లూరు జట్టు రజితం, కడప జట్టు కాంస్య పతకాలు సాధించాయి. మంగళవారం ఎస్‌డీఆర్‌ వరల్డ్‌ స్కూల్‌ ఆవరణలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్కూల్‌ గేమ్స్‌ రగ్బీ సంఘ ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ..పోటీల్లో 8 జిల్లాల జట్లు పాల్గొని తమ ప్రతిభను చాటాయన్నారు. స్కూల్‌ చైర్మన్‌ కొండారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా రగ్బీ అసోసియేషన్‌ అధ్యక్షుడు సురేందర్, జిల్లా స్కూల్‌ గేమ్‌ సెక్రటరీ లక్ష్మినర్సయ్య తదితరులు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు