రన్‌వేపై గిరిజన యువకుడు

16 Mar, 2017 22:42 IST|Sakshi
  • ఎయిర్‌పోర్టులో కలకలం
  • మధురపూడి (రాజానగరం) : 
    రాజమహేంద్రవరం విమానాశ్రయంలో భద్రతా ఏర్పాట్లు.. నేతి బీరకాయలో నేతి ఉన్న చందంగా.. ఉంటాయన్న విషయం.. విమానాశ్రయ వర్గాలకే ఆలస్యంగా తెలిసింది. ఈ విషయం ఎయిర్‌పోర్టు వర్గాల్లో కలకలం రేపింది. ఈ కథా కమామిషు ఇలా ఉంది... ఈ నెల 13వ తేదీ సోమవారం ఏజెన్సీ ప్రాంతం నర్సాపురానికి చెందిన గిరిజన యువకుడు స్వామిదొర ఎయిర్‌పోర్టు ర¯ŒSవేకు వెళ్లడం చర్చనీయాంశం అయింది. అక్కడ అభివృద్ధి పనుల్లో పనిచేస్తున్న వారితో అతడూ సెక్యూరిటీ షెడ్డులో కూర్చున్నాడు. అతడిని భద్రతా సిబ్బంది ఆలస్యంగా గుర్తించింది. స్వామిదొర వద్ద అగ్గిపెట్టె ఉండటం అందరిలో ఆందోళనను కలిగించింది. అతడిని ఎయిర్‌పోర్టు వర్గాలు కోరుకొండ పోలీసు స్టేష¯ŒSకు అప్పగించాయి. స్వామిదొర మానసికస్థితి సరిగా లేదని ఎస్సై ఆర్‌. మురళీమోహా¯ŒS తెలిపారు. పూర్తి సమాచారాన్ని సేకరించిన తర్వాత పూచీకత్తుపై అతడిని విడిచిపెట్టారు. టికెట్‌ లేని వారు, సందర్శకులను టెర్మినల్‌ భవనం వరకే ఎయిర్‌పోర్టులో అనుమతిస్తారు. ర¯ŒSవే పైకి, ఎప్రా¯ŒSలోని పార్కింగ్‌బే వెళ్లడానికి ఇతరులకు అనుమతులు ఉండదు. అక్కడ మూడెంచెల రక్షణ వలయం ఉంటుంది స్పెషల్‌ ప్రొటెక్ష¯ŒS ఫోర్స్, ఎస్పీఎఫ్‌ సిబ్బందిని ఏర్పాటు చేశారు. సుమారు 64 మంది ఎస్పీఎఫ్‌ సిబ్బంది కాపలా ఉంటారు. ఎయిర్‌పోర్టులోని అన్ని ప్రాంతాల్లోనూ సెక్యూరిటీ ఉంటుంది. వీరందరి కన్నుకప్పి ఆ యువకుడు ఎలా వెళ్లాడనే విషయం ఎయిర్‌పోర్టు వర్గాలకు అవగతం కావడం లేదు.
     
మరిన్ని వార్తలు