గ్రామీణ క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగాలి

8 Oct, 2016 23:49 IST|Sakshi
కామారెడ్డి రూరల్‌:
గ్రామీణ క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగాలని మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ వేముల ప్రశాంత్‌రెడ్డి సూచించారు. శనివారం రాత్రి కామారెడ్డి పట్టణంలోని బాబాగౌడ్‌ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వాలీబాల్‌ క్రీడల ముగింపు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఓడడం, గెలవడం ప్రధానం కాదని.. క్రీడల్లో పాల్గొనడమే ముఖ్యమని ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. తన తండ్రి వేముల సురేందర్‌రెడ్డి స్మారకార్థం రాష్ట్ర స్థాయి వాలీబాల్‌ క్రీడలు నిర్వహించడం అభినందనయమన్నారు. తన తండ్రి 48 సంవత్సరాల వయస్సులో కూడా క్రికెట్‌ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించారని, ఆయనతో పాటు తాను కూడా క్రికెట్‌ ఆడానని చెప్పారు.
క్రీడాభివృద్ధికి కృషి: గంప గోవర్ధన్‌
 రాష్ట్రస్థాయిలో గెలుపొందిన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదగాలని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ సూచించారు. రాబోయే రోజుల్లో క్రీడాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. సీఎం కేసీఆర్‌ భవిష్యత్తులో గ్రామీణ క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం కల్పిస్తారని చెప్పారు. క్రీడలు ర్వహించిన నిట్టు వేణుగోపాల్‌రావును ప్రశాంత్‌రెడ్డి, గంప గోవర్ధన్‌ అభినందించారు. 
విజేతలు వీరే...
వేముల సురేందర్‌రెడ్డి స్మారక వాలీబాల్‌ టోర్నీలో పురుషుల విభాగంలో వరంగల్‌ జిల్లా జట్టు విజేతగా నిలిచింది. ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిజామాబాద్, హైదరాబాద్‌ జట్లు నిలిచాయి. మహిళా విభాగంలో నిజామాబాద్‌ విజేతగా నిలవగా, ద్వితీయ బహుమతి నల్గొండ, తృతీయ బహుమతిని హైదరాబాద్‌ జిల్లా జట్టు కైవసం చేసుకున్నాయి. ప్రథమ స్థానంలో నిలిచిన జట్లకు విప్‌ గోవర్ధన్‌ రూ.10 వేల చొప్పున నగదు పురస్కారం అందజేశారు. డీసీఎంఎస్‌ చైర్మన్‌ ముజీబోద్దిన్, ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గడీల శ్రీరాములు, నిట్టు వేణుగోపాల్‌రావు, జిల్లా వాలీబాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి, ప్రతినిధులు, మల్లేశ్‌గౌడ్, అశోక్‌కుమార్, మోహన్‌కుమార్, లింగన్న, మనోజ్‌రెడ్డి, మసూద్‌అలీ, గోపిగౌడ్, పీడీలు, పీఈటీలు, క్రీడల ఆర్గనైజింగ్‌ కార్యదర్శి బాలు తదితరులు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు