శభాష్‌.. ఛాయాబాయి

2 Sep, 2016 23:32 IST|Sakshi
శభాష్‌.. ఛాయాబాయి
  • చీర సాయంతో  ప్రాణభిక్ష పెట్టిన మహిళ
  • బాల్కొండ : 
    ఎస్సారెస్పీ కాలనీలో నివసించే ఛాయాబాయి.. తన సాహసంతో ముగ్గురి ప్రాణాలను నిలిపింది. కాకతీయ కాలువలో కొట్టుకుపోతున్న వారిని కాపాడింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన గురించి ఆమె మాటల్లోనే.. ‘‘సోమవారం సాయంత్రం యాల్ల మా కాలనీకి చెందిన సోను కాకతీయ కాలువ ఒడ్డుకు వెళ్లి అందులో జారీ పడిపోయాడు. సోనును కాపాడేందుకు మా కాలనీలో పదో తరగతి చదువుతున్న కూనల్‌ కాలువలోకి దిగాడు. అతడూ జారి పడి కొట్టుకుపోసాగాడు. మా ఇంటి పక్కన ఉండే 50 ఏండ్ల దేవిదాస్‌ వాళ్లను కాపాడడానికి ప్రయత్నించి, అతడూ జారిపడిపోయాడు. విషయం తెలిసి నేనూ అక్కడికి వెళ్లాను. వెంటనే చీరను విడిచి వాళ్లవైపు విసిరాను. వాళ్లకు అందకపోవడంతో ధైర్యం చేసి కాలువలోకి దిగాను. దేవిదాస్, కునాల్‌ చీరను అందుకుని మెల్లిగా ఒడ్డుకు చేరారు. తర్వాత సోను కూడా ఒడ్డుకు చేరాడు.’’ అని ఛాయాబాయి వివరించింది. పారుతున్న నీళ్లను చూస్తే భయమేసినా.. ముగ్గురి ప్రాణాలను కాపాడడానికి సాహసం చేశాను.. 
     
    కష్టాల కడలిలోంచి..
    ఛాయాబాయి జీవిత నేపథ్యం కష్టాల కడలిలో సాగింది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణ సమయంలో పనుల కోసం మహారాష్ట్ర నుంచి పలు కుటుంబాలు ఇక్కడికి వలసవచ్చాయి. అలా వచ్చిన లక్ష్మీబాయి, లింబాజీల ఎనిమిది సంతానంలో నాలుగో సంతానం ఛాయాబాయి. ఆమెకు ప్రస్తుతం 35 ఏళ్లుంటాయి. మానసిక పరిస్థితి బాగా లేదన్న కారణంతో ఒక పాప పుట్టాక భర్త వదిలేశాడు. ప్రస్తుతం ఆమె స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో ఆయాగా పని చేస్తూ కూతురును పోషించుకుంటోంది. ఆమె తన సాహసంతో ముగ్గురిని కాపాడినందుకు గ్రామస్తులు అభినందిస్తున్నారు. 
    కునాల్‌ సాహసం తక్కువేమీ కాదు..
    శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ కాలనీకి చెందిన కునాల్‌ సాహసం తక్కువేమీ కాదు. అతడు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదోlతరగతి చదువుతున్నాడు. కునాల్‌ సాయంత్రం వేళ కాకతీయ కాలువ వైపు వెళ్లాడు. అక్కడ ఒడ్డుపై జనం కనిపించడంతో అటువైపు పరుగెత్తుకుంటూ వెళ్లి, కాలువలో పడి ఉన్న సోనును రక్షించడానికి నీళ్లలోకి దూకేశాడు. ఆ సమయంలో కాకతీయ కాలువలో 6,500 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. అయినా భయపడకుండా ఒకరిని రక్షించడానికి యత్నించి అందరి అభిమానాల్ని చూరగొన్నాడు.
     
              ఛాయబాయి సహసం చేసి తన ఒంటి మీద ఉన్న చీరను విడిచి కాకతీయ కాలువలో కొట్టుకు పోతున్న మగ్గురికి ప్రాణ భిక్ష పెట్టింది. ఛాయ బాయి చదువు కోలేదు. కాని ఆమేకు వచ్చిన ఆలోచన ఆమోఘం అద్భుతం. ఆమే సమయ స్పూర్తికి అందరు ఆశ్చర్య పోవల్సిందే.  కాలనీ వాసులు అందరు ఒక్కోSక్కరు సంఘటన స్థలానికి తరలి వచ్చి కొట్టుకు పోతున్న వారిని చూసి రోధిస్తున్నారే తప్ప ఒక్కరు కూడ కాపాడటానికి ప్రయాత్నం చేయడం లేదు. కాని ఛాయబాయి ఒక్క క్షణం ఆలోచించకుండ తన ఒంటి పై ఉన్న చీరను వదిలి కాలువలో కొట్టుకు పోతున్న వారికి అందించింది. చీరతో పాటు తనను కాలువలోకి లాగుతున్న ఆధైర్య పడకుండ ఒడ్డు ను గట్టిగ పట్టుకుంది. 
మరిన్ని వార్తలు