ప్రత్యేక పూజలు చేసిన సబితారెడ్డి

24 Jul, 2016 23:16 IST|Sakshi
ప్రత్యేక పూజలు చేసిన సబితారెడ్డి

మహేశ్వరం: మండల పరిధిలోని మంఖాల్‌ గ్రామంలో ఆదివారం బోనాల పండగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా మహంకాళీ బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నియోజకవర్గంలో ప్రసిద్ధి గాంచిన అతి పూరాతన ఆలయంలో ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కుంకుమార్చన, పుష్పాలంకరణ, అభిషేకం చేసి పసుపు, గంధంతో అమ్మవారిని అలంకరించారు. సాయంత్రం గ్రామంలోని యువజన సంఘాల ఆధ్వర్యంలో సుమారు 200 బోనాలు.. శివసత్తుల పూనకాలు, పోతరాజుల నృత్యాలతో, యువకుల డ్యాన్సులతో భారీ ఊరేగింపు నిర్వహించారు. ఇతర గ్రామాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ర్యాలీ అనంతరం మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఎంపీపీ పెంటమల్ల స్నేహసురేష్, సర్పంచ్‌ అత్తెని కౌసల్యబాబు యాదవ్, ఎంపీటీసీ మదన్‌మోహన్, ఉప సర్పంచ్‌ కప్పల సుందరయ్య, కాంగ్రెస్‌ నాయకులు అత్తెని మహేందర్‌ యాదవ్ తదితరులు ప్రత్యేక పూజలు చేశారు. పహడీషరీఫ్‌ సీఐ చలపతి, ఎస్‌ఐ మహేందర్‌జీ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా బోనాల ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు బ్రహ్మంచారి, చిప్ప సురేష్, యాదయ్య, శ్రీకాంత్, రవి నాయక్, నాసర్‌ఖాన్, సామెల్‌రాజ్, నర్సింగ్‌రాజ్, విలాస్, శ్రీనివాస్‌ నాయక్, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

మాజీ మంత్రి పూజలు
మంఖాల్, తుక్కుగూడ గ్రామాల్లో మహంకాళీ బోనాల ఉత్సవాలకు మాజీ మంత్రి సబితారెడ్డి హాజరయ్యారు. అమ్మవారికి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్షాలు సకాలంలో సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండేలా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్లు మాజీ మంత్రి తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారని ఆమె చెప్పారు. ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ స్నేహ, పీఏసీఎస్‌ చైర్మన్‌ అంబయ్య యాదవ్, మంఖాల్‌ గ్రామ సర్పంచ్‌ కౌసల్య, ఉప సర్పంచ్‌ సుందరయ్య, నాయకులు కొమిరెడ్డి నర్సింహరెడ్డి, మాజీ ఎంపీపీ పాండు నాయక్, మహేందర్‌ యాదవ్, నల్ల వీరేష్‌గౌడ్, మంత్రి రాజేష్, కాకి ఈశ్వర్‌ ముదిరాజ్, సురేష్, శ్రీనివాస్‌గౌడ్, యాదగిరి, చంద్రశేఖర్‌రెడ్డి, వెంకటేష్‌ యాదవ్, శ్రీధర్‌గౌడ్‌ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు