ఖేలో ఇండియాలో సాగర్‌ సత్తా

30 Jan, 2017 00:21 IST|Sakshi
విజయవాడ స్పోర్ట్స్‌ : గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరుగుతున్న ఖేలో ఇండియా జాతీయ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర అథ్లెట్‌ ఎం.సాగర్‌ ఫాస్టెస్ట్‌ (100 మీటర్ల పరుగు) రన్నింగ్‌లో రజత పతకం సాధించాడు. అండర్‌–14 విభాగంలో ఫాస్టెస్‌ రన్నర్‌గా జార్ఖండ్‌ అథ్లెట్‌ నిలువగా, కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం కల్లుదేవకుంటకు చెందిన ఎం.సాగర్‌ (11.82 సెకన్లు) ద్వితీయ స్థానంలో నిలిచి రాష్ట్రానికి రజత పతకం సాధించాడు. ఈ సందర్భంగా సాగర్‌ను సాయ్‌ రీజనల్‌ డైరెక్టర్‌ (గుజరాత్‌) రూప్‌కుమార్‌నాయుడు, శాప్‌ వీసీ అండ్‌ ఎండీ ఎస్‌.బంగారురాజు, ఓఎస్‌డీ పి.రామకృష్ణ అభినందించారు. 
 
మరిన్ని వార్తలు