పెరుగుతున్న సాగర్‌ నీటి మట్టం

26 Sep, 2016 23:01 IST|Sakshi
పెరుగుతున్న సాగర్‌ నీటి మట్టం
కృష్ణా ఎగువ పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో దిగువ జలాశయాలకు వరదనీరు వచ్చి చేరుతోంది. విద్యుత్‌ ఉత్పాదన అనంతరం శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్‌కు 74,140 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌ జలాశయ నీటిమట్టం 519.00 అడుగుల వద్ద ఉంది. ఇది 147.4580 టీఎంసీలకు సమానం. గత ఏడాది ఇదే రోజు సాగర్‌ నీటిమట్టం 511.00 అడుగుల వద్ద ఉంది. – విజయపురి సౌత్‌
>
మరిన్ని వార్తలు