సొమ్ములిస్తేనే రాయితీలిస్తారా ?

29 Oct, 2016 00:05 IST|Sakshi
  • ఇలా అయితే రైతు వ్యవసాయం చేయగలడా...
  • వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి 
  • అమలాపురం : 
    ‘యాంత్రీకరణపై ఇచ్చే రాయితీల కోసం అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులకు రైతులు సొమ్ములివ్వాల్సి వస్తోంది. ఇలా అయితే రైతు వ్యవసాయం చేయగలడా? పైగా టీడీపీకి చెందిన బినామీలు రైతుల పేరుతో యంత్రాలను తీసుకుంటున్నారు. కోనసీమలో పర్యటిస్తే పలుచోట్ల రైతులు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.   ఇది చాలా అన్యాయం. ఇంత దిగజారుడుతనం గతంలో ఎప్పుడూ చూడలేదు’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.ఎస్‌.నాగిరెడ్డి విమర్శించారు. అమలాపురం శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మామిడికుదురులో తమ మండలానికి పది పవర్‌టిల్లర్లు వస్తే అవి ఎవరికి చేరాయో తెలియడం లేదని, యాంత్ర పరికరాలకు ఇచ్చే రాయితీల్లో ప్రజాప్రతినిధులు వాటా అడుగుతున్నట్టు రైతులు ఫిర్యాదు చేశారన్నారు. జిల్లాలో రైతులకు పెట్టుబడి రాయితీగా ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదన్నారు. సమయానికి సాగునీరు విడుదల చేయకపోవడం, డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉండడంతో రైతులు సాగు చేయని పరిస్థితి లేనందునే కోనసీమలో 50 వేల ఎకరాల్లో వరి రైతులు ఖరీఫ్‌ సాగు చేయలేదని నాగిరెడ్డ ఆరోపించారు. పార్టీ సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి, పి.గన్నవరం కో ఆర్డినేటర్‌ కొండేటి చిట్టిబాబు, రైతు విభాగం ఆర్గనైజింగ్‌ ప్రధాన కార్యదర్శి, ఐదు జిల్లాల ఇ¯ŒSచార్జి కొవ్వూరి త్రినా«ధ్‌రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ, రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీ పెంకే వెంకట్రావు, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు జున్నూరి వెంకటేశ్వరరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహన్, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి కొర్లపాటి కోటబాబు, జిల్లా బీసీసెల్‌ అధ్యక్షుడు మట్టపర్తి మురళీకృష్ణ, విద్యార్థి విభాగం అధ్యక్షుడు జక్కంపూడి కిరణ్, డీసీసీబీ మాజీ డైరెక్టర్‌ జున్నూరి బాబి, పట్టణ, ఉప్పలగుప్తం మండల పార్టీ అధ్యక్షులు మట్టపర్తి నాగేంద్ర, బద్రి బాబ్జి, పార్టీ జిల్లా కార్యదర్శి నిమ్మకాయల హనుమంత శ్రీనివాస్, పార్టీ నాయకులు సూదా గణపతి, చిక్కం బాలయ్య, బొక్కా శ్రీను, జంపన బాపిరాజులు పాల్గొన్నారు.  
     
మరిన్ని వార్తలు