సాహిత్యంతోనే సామాజిక స్పృహ

21 Jul, 2016 23:52 IST|Sakshi
 
– ఎస్వీయూ వీసీ దామోదరం
యూనివర్సిటీక్యాంపస్‌ : చదువుతో పాటు సాహిత్యంపై విద్యార్థులు ఆసక్తి పెంచకుంటే  సామాజిక  స్పృహ  పెరుగుతుందని ఎస్వీయూ వీసీ దామోదరం పేర్కొన్నారు. ఎస్వీయూ ఆర్ట్స్‌ బ్లాక్‌ ఆడిటోరియంలో గురువారం ‘రాయలసీమ రచయితుల కథలు – స్త్రీవాద జీవిత చరిత్ర ’ అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన వీసీ మాట్లాడుతూ  రాయలసీమలో సాహిత్యానికి కొదవలేదన్నారు. కట్టమంచి రామలింగారెడ్డి నుంచి గల్లా అరుణకుమారి వరకు సాహిత్య రంగంలో విశేష సేవలు అందించారని పేర్కొన్నారు. అయితే సీమ సాహిత్యంలో స్త్రీవాద గొంతుక వినిపించాల్సిన అవసరం పెరిగిందని అభిప్రాయపడ్డారు.  ఇలాంటి సదస్సులు నిర్వహించడం మంచి పరిణామమని ఆర్ట్స్‌ బ్లాక్‌ ప్రిన్సిపాల్‌ మునిరత్నం  తెలిపారు. ఎం.రవికుమార్‌ మాట్లాడుతూ  స్త్రీ, పురుషుల మధ్య అంతరాలు తొలగించాల్సిన అవసరం ఉందన్నారు.  ఈ కార్యక్రమంలో మహిళా వర్సిటీ ప్రొఫెసర్‌ విజయలక్ష్మి సుభాషిణి కథలపై ప్రసంగించారు. సదస్సులో అధ్యాపకులు పేట శ్రీనివాసులురెడ్డి, ఎస్‌.రాజేశ్వరి, ఆర్‌.రాజేశ్వరి, దామోదర్‌నాయుడు పాల్గొన్నారు.
 
21టిపిఎల్‌164ః సదస్సులో మాట్లాడుతున్న ఎస్వీయూ వీసీ దామోదరం
 
మరిన్ని వార్తలు