మధురం.. సాయినామ స్మరణం

19 Dec, 2016 00:14 IST|Sakshi
మధురం.. సాయినామ స్మరణం
పుట్టపర్తి టౌన్ : సత్యసాయి నామ స్మరణలో ఉన్న మాధుర్యాన్ని, మానవాళి శ్రేయస్సుకు బాబా పాటుపడిన వైనాన్ని చాటుతూ చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు మంత్రముగ్ధులను చేశాయి. పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన శ్రీకాకుళం సత్యసాయి భక్తులు ఆదివారం సాయంత్రం సాయికుల్వంత్‌ సభామందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత శ్రీకాకుళం జిల్లా సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షుడు రమణయ్య జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న సత్యసాయి సేవలను, ఆధ్యాత్మిక కార్యక్రమాలను వివరించారు. పిదప చిన్నారులు ‘సత్యసాయి భక్త సామాజ్యం’ పేరుతో నృత్యరూపకం ప్రదర్శించారు. రావణ సంహారం చేసిన శ్రీరాముడు, గోవర్దన గిరిని ఎత్తిన శ్రీకృష్ణుడు, వరాహ, మశ్చ, వామన రూపంలో అవతరించిన దేవదేవుడు, సత్యసాయి ఒక్కరేనన్న సందేశాన్నిస్తూ చిన్నారులు నృత్యరూపకాన్ని కొనసాగించారు. మరో అద్భుత ప్రదర్శన ‘పాండవ విజయం’ ఘట్టంతో భక్తులు పరవశించిపోయారు. నృత్యరూపకం ముగింపులో దేశభక్తిని చాటుతూ ఆలపించిన ‘వందేమాతరం సుందర భారతం.. విశ్వానికి వెలుగుచూపు ప్రేమ మందిరం’ గీతం ఆద్యంతం ఆకట్టుకుంది. భక్తిప్రపత్తులతో తనను కొలిచే భక్తుల పాలిట పెన్నిధిగా సత్యసాయి అన్నివేâýæలా వెంట ఉండి అదుకుంటాడన్న సందేశంతో నృత్యరూపం ముగించారు.  
భక్తిశ్రద్ధలతో చిత్రావతి మంగళ హారతి 
శ్రీకాకుళం జిల్లా సత్యసాయి భక్తులు  ఆదివారం వేకువజామునే ప్రశాంతి నిలయం నుంచి చిత్రావతి హారతి ఘాట్‌ వద్దకు చేరుకుని, అక్కడ సత్యసాయి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. వందలాది మంది భక్తులు హారతులు చేతబూని సత్యసాయికి మంగâýæహారతి ఇచ్చి, భక్తిగీతాలు ఆలపించారు. అనంతరం సత్యసాయి చిత్రపటంతో నగర సంకీర్తన నిర్వహించారు. ప్రశాంతి నిలయంలోని సాయిభక్త నివాస్‌లో వేదపండితులు మంత్రోచ్ఛారణ నడుమ సత్యసాయి సామూహిక వ్రతాలను భక్తిశ్రద్ధలతో పాటించారు. అనంతరం ప్రశాంతి నిలయంలో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.   
మరిన్ని వార్తలు