నిండైన అందానికి ‘సాక్షి’

20 Aug, 2016 20:56 IST|Sakshi
నిండైన అందానికి ‘సాక్షి’
* అత్యాధునిక థర్మో మాస్క్‌ ఫేషియల్‌పై అవగాహన 
ఆర్థికంగా ఎదుగుతామంటున్న మహిళలు 
‘సాక్షి మైత్రి’ సహకారంపై ప్రశంసలు
 
గుంటూరు ఈస్ట్‌ : లక్ష్మీపురం మెయిన్‌ రోడ్డులోని షీ అండ్‌ షైన్‌ హెర్బల్‌ బ్యూటీ క్లినిక్‌లో నెలరోజుల పాటు ‘సాక్షి’ మైత్రి బ్యూటీషియన్‌ కోర్సులో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్‌ ప్రదానం కార్యక్రమం శనివారం నిర్వహించారు. ప్రముఖ బ్యూటీషియన్‌ ఎన్‌.సుజాత శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. జూలై 21వ తేదీ నుంచి ఆగష్టు 21వ తేదీతో బ్యూటీషియన్‌ కోర్సులో శిక్షణ ముగిసింది. త్రెడింగ్, వ్యాక్స్‌ ,పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచింగ్, స్కిన్‌ కేర్, హేర్‌ కేర్, వైట్నింగ్, ఫేస్‌ ప్యాక్, డాండ్రఫ్‌ ట్రీట్‌మెంట్, హెయిర్‌ ఫాల్‌ ట్రీట్‌మెంట్, హెర్‌ కట్స్,హెర్‌ సట్యిల్స్, హెన్నా ప్రిపరేషన్, డై అప్లికేషన్, బ్రైడల్‌ మేకప్స్, ఓబీసీటీ అండ్‌ న్యూట్రీషియన్‌ డైట్, హశ్రీయిర్‌ మసాజ్, గ్రూమింగ్, ఫేషియల్స్, యాంటీ యేజింగ్‌ అండ్‌ ధర్మో హెర్బల్‌ షేషియల్స్‌ అంశాలలో శిక్షణ ఇచ్చారు. బ్యూటీషియన్‌ వృత్తిలో నైపుణ్యాలు తెలుసుకున్నామని, తద్వారా ఆర్థిక స్వావలంబన సాధిస్తామని శిక్షణ పొందిన మహిళలు ఆత్మవిశ్వాసంతో చెప్పారు. శిక్షణపై అభిప్రాయాలు వారి మాటల్లోనే.. 
 
శిక్షణ బాగుంది.. 
కె.మేరి ఫ్లోరెన్స్, బీఏ, బీఈడీ, ఫిరంగిపురం
బ్యూటీషియన్‌ శిక్షణ కార్యక్రమ విషయం ‘సాక్షి’ దినపత్రికలో చూసి చేరాం. శిక్షణ ప్రారంభమైన కొద్ది రోజులకే ఈ కోర్సుపై ఎంతో అభిమానం పెరిగింది. శిక్షకురాలు సుజాత ప్రతి అంశాన్ని ఎంతో ఓపికగా బోధించారు. మా చేత పలుమార్లు ప్రాక్టికల్స్‌ చేయించారు. శిక్షణ అనంతరం అడ్వాన్స్‌ కోర్సు కూడా ఇక్కడే చేరాలని నిర్ణయించుకున్నాం. రాజధాని నేపథ్యంలో బ్యూటీషియన్లుకు మంచి డిమాండ్‌ ఉంది. సొంతగా బ్యూటీపార్లర్‌ ఏర్పాటు చేసుకుని మా కాళ్లమీద మేము నిలబడగలుగుతాం అనే ఆత్మవిశ్వాసం కలిగింది.  
 
 అత్యాధునిక శిక్షణ..
ఎన్‌.సుజాత, శిక్షకురాలు 
యాంటీ యేజింగ్‌ ఫేషియల్‌గా అత్యాధునికమైన థర్మో మాస్క్‌ ఫేషియల్‌ను ఈ కోర్సులో శిక్షణ ఇచ్చాం. ఆపరేషన్‌ లేకుండా మొహంపై ఉన్న ముడతలను పొగొట్టే మంత్ర దండం ఈ దర్మో మాస్క్‌ . ఈ ఒక్క ఫేషియల్‌ నేర్పించడానికే వేల రూపాయలు తీసుకుంటారు. ‘సాక్షి’ ఆధ్వర్యంలో ప్రాథమిక అంశాలతోపాటు ఈ ఫేషియల్‌ను కూడా నేర్పించాం. శిక్షణ పొందిన వారికి ఆర్థిక స్వావలంబనకు ఇంది ఎంతో ఉపయోగం.
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా