మీడియా స్వేచ్ఛకు సంకెళ్లా..?

15 Jun, 2016 23:43 IST|Sakshi

 శ్రీకాకుళం అర్బన్: మీడియాపై ఆంక్షలు ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడమేనని పలువురు ప్రజా ప్ర తినిధులు, మీడియా ప్రతినిధులు ధ్వజమెత్తారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేసినందుకు నిరసనగా పలువురు ప్రజా ప్రతినిధులు, మీడియా ప్రతినిధులతో శ్రీకాకుళంలోని అంబేడ్కర్ కూడలి వద్ద బుధవారం సాయంత్రం కొవ్వొత్తులతో ర్యా లీ, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
 
 ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి మాట్లాడుతూ సాక్షి ఛానల్ ప్రసారాలను నిలిపివేయడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అక్రమాలు సాక్షి చానల్ ద్వారా ప్రసారం చేస్తే ఎక్కడ ప్రజలకు తెలిసిపోతుందోనని భయపడి సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేసిం దన్నారు. ఇలా ఒక చానల్‌పై కక్షపూరితంగా వ్యవహరించి అగౌరవపరచడం పత్రికా స్వేచ్ఛకు భం గం కలిగించడమేనన్నారు. ఏపీయూడబ్ల్యుజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొంక్యాణ వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే మీడియా స్వేచ్ఛ ఎంతో అవసరమన్నారు.
 
 టీడీపీ ప్రభుత్వం మీడియా, పాత్రికేయులపై దాడులు చేయిస్తోందని విమర్శించారు. మీడియా ప్రతినిధి ఎస్.జోగినాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఆటవిక పాలన సాగుతోందని విమర్శించారు. మేధావులంతా చంద్రబాబు పాలనను నిశితంగా గమనిస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ నేత టి.కామేశ్వరి మాట్లాడుతూ మీడియాపై ఆం క్షలు తక్షణమే ఎత్తివేయాలన్నారు.
 
  కేవలం ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అక్రమాలు బయటపెడుతుందనే అక్కసుతోనే సాక్షి టీవీ ప్రసారాలు నిలిపివేసిందన్నారు. ఈ సందర్భంగా పాత్రికేయులు, మీడియా ప్రతినిధు లు, ప్రజాప్రతినిధులంతా కొవ్వొత్తులతో అంబేద్కర్ కూడలి వద్ద నిరసన తెలిపారు. అనంతరం ర్యాలీగా అంబేద్కర్ కూడలి వద్దనుంచి కాంప్లెక్స్, మళ్లీ కాంప్లెక్స్ కూడలి వద్దనుంచి అంబేద్కర్ కూడలి వరకూ ర్యాలీ నిర్వహించారు.
 
 కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు సాధు వైకుంఠరావు, కోరాడ రమేష్, గుడ్ల మల్లేశ్వరరావు, బిడ్డిక లక్ష్మి, పొందల విశ్వేశ్వరరావు, ఎం.మాధవరావు,  మీడి యా ప్రతినిధులు సీహెచ్.నాగభూషణరావు, డోల అప్పన్న, లక్షమణరావు, పి.భీమారావు, బగాది నారాయణరావు, కె.రాజు, పి.శ్రీనుబాబు, అధిక సంఖ్య లో మీడియా ప్రతినిదులు, పాత్రికేయులు పాల్గొన్నారు.
 
 ఆ ధైర్యం ఎవరికీ లేదు...
 రాజాం/రాజాంరూరల్: ప్రజాస్వామ్య దేశంలో మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేసే ధైర్యం ఎవరూ చేయలేరని, అలా చేసిన వారు కాలగర్భంలో కలిసిపోక తప్పదని రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు. సాక్షి చానల్ పై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ  రాజాం ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు.  ఇందులో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ఒకప్పుడు ఇందిరా గాంధీ ఇలాంటి ప్రవర్తనతోనే ప్రజలకు క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చిందని, చంద్రబాబును మాత్రం ప్రజలు క్షమాపణలతో వదిలిపెట్టరని అన్నారు.
 
  కాపు రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్న ముద్రగడ పద్మనాభం దీక్షను చూపించకూడదనే ఉద్దేశంతో సాక్షిపై నిషేధాజ్ఞలు విధించడం దారుణమన్నారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు గుడబండి సూర్యనారాయణ, ఉపాధ్యక్షుడు భీం పల్లి తిరుపతి, జాతీయ కౌన్సిల్ మాజీ సభ్యులు ఉల్లాకుల నీలకంఠేశ్వరయాదవ్, జిల్లా కార్యవర్గ సభ్యులు కల్లేపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరి గిన ఈ కార్యక్రమంలో ముందుగా రాజాం ప్రెస్‌క్లబ్ నుంచి పాలకొండ జంక్షన్ వరకూ ర్యాలీ నిర్వహించి అక్కడ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.
 
 ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మానవ హారం చేపట్టి అక్కడ నుంచి ర్యాలీగా తహశీల్దార్ కార్యాలయం వరకు వెళ్లి తహశీల్దార్ వై.శ్రీనివాసరావుకు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో రాజాం, రేగిడి, సంతకవిటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ విలేకరులతో పాటు సీఐటీయూ డివిజన్ కార్యదర్శి సీహెచ్ రామ్మూర్తినాయడు, బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు అంది వీరభద్రయ్య, జాతీయ యువజన అవార్గు గ్రహీత పెంకి చైతన్యకుమార్, వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ బూరాడ అప్పలనాయుడు, పాలవలస శ్రీనివాసరావు, పారంకోటి సుధ, వెంపల లక్ష్మణరావు, సీనియర్ పాత్రికేయులు ఉరిటి శశిభూషణరావు, టంకాల సత్యంనాయుడు తదితరులు పాల్గొన్నారు.
 
 వీరిలో వైఎస్‌ఆర్ సీపీ నాయకులు అప్పలనాయుడు, సుధ, లక్ష్మణరావులు మాట్లాడుతూ చంద్రబాబుకు రోజులు దగ్గరపడ్డాయని చెప్పారు. నిషేధాజ్ఞలతో ప్రజల్లో విలువ కోల్పోతున్నారని అన్నారు. ప్రసారాలపై అభ్యంతరాలు ఉంటే కోర్టుకు వెళ్లి తేల్చుకోవాలని సూచించారు.
 

>
మరిన్ని వార్తలు