సలాం.. గులాం తారీఖ్‌

1 Sep, 2016 22:52 IST|Sakshi
సలాం.. గులాం తారీఖ్‌

వైవీయూ :

యోగివేమన విశ్వవిద్యాలయం వైస్‌ ప్రిన్సిపాల్‌ ఆచార్య షేక్‌ గులాం తారీఖ్‌ను రాష్ట్ర ఉత్తమ అధ్యాపక ప్రతిభా అవార్డు వరించింది.   కడప నగరం అగాడికి చెందిన ప్రొఫెసర్‌ డా. షేక్‌ గులాంరసూల్‌ (లేట్‌), అజీమాబి దంపతుల కుమారుడైన ఈయన తండ్రి చూపిన బాటలోనే నడుస్తూ అధ్యాపకవత్తిలో కొనసాగుతున్నారు.  తండ్రి వత్తిరిత్యా తమిళనాడులోని అన్నామలై విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నపుడు ఆయన ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్య  అదే విశ్వవిద్యాలయంలో పూర్తిచేశారు. అనంతరం ఎంఫిల్, పీహెచ్‌డీలను శ్రీకష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పూర్తిచేశారు. 1983లో అధ్యాపక వత్తిలో ప్రవేశించిన ఆయన కర్నూలులోని ఉస్మానియా కళాశాలలో లెక్చరర్‌గా, రీడర్‌గా, అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు. అనంతరం 2008 జులైలో యోగివేమన విశ్వవిద్యాలయంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2013 జనవరిలో ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు.   ప్రస్తుతం ఆర్ట్స్‌ విభాగం డీన్‌గా, హాస్టల్స్‌ చీఫ్‌ వార్డెన్‌గా, పీజీ కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.  ఈయన సతీమణి డా. నాజినీన్‌ పర్వీన్‌ సైతం వైవీయూ పర్యావరణ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
ఆంగ్లసాహిత్యంలో పట్టు...
  ఆచార్య గులాం తారీఖ్‌ ‘కాంటెంపరరీ ఆఫ్రికన్‌ నావెల్‌’ అనే పుస్తకాన్ని రచించగా ఢిల్లీకి చెందిన పబ్లిషర్స్‌ దీనిని ముద్రించారు. దీంతో పాటు 30 జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో ఆయన పత్రాలు ప్రచురితమయ్యాయి. 50 వరకు జాతీయ, అంతర్జాతీయస్థాయి సెమినార్‌లలో పాల్గొని ప్రసంగించారు. బ్రిటీష్‌  , ఆఫ్రికన్‌ , ఇండియన్‌ ఇంగ్లీషు లిటరేచర్‌ అన్న అంశాలపై  పరిశోధన  సాగుతోంది. ఆయన వద్ద ఇప్పటి వరకు 10 ఎంఫిల్, 3 పీహెచ్‌డీలు అవార్డు కాగా మరో 8 మంది  పీహెచ్‌డీ చేస్తుండటం విశేషం.  
అవార్డు బాధ్యత పెంచింది..
రాష్ట్ర అధ్యాపక అవార్డు రావడం సంతోషంగా ఉంది.  కష్టపడితే ఫలితం ఉంటుందని మా నాన్న ఎప్పుడూ చెప్పేవారు. నేను దానినే నమ్మాను. అవార్డు నాలో బాధ్యతను మరింత పెంచింది.  తనకు సహకరించిన వైస్‌ఛాన్స్‌లర్, రెక్టార్, రిజిస్ట్రార్, ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, విద్యార్థులకు ధన్యవాదాలు.
– ఆచార్య షేక్‌ గులాం తారీఖ్, రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డు గ్రహీత
 
 

మరిన్ని వార్తలు