బోధనేతర ఉద్యోగుల జీతాల పెంపు

12 Dec, 2016 15:15 IST|Sakshi

ఎస్కేయూ : శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న టైం స్కేల్, మినిమమ్‌ స్కిల్‌ ఉద్యోగుల జీతాలు పెంచారు. వర్శిటీలో బుధవారం పాలక మండలి సమావేశం జరిగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలకు పాలక మండలి ఆమోదం తెలిపింది.  రూ 2.91 కోట్లతో రెండు నూతన భవనాల నిర్మాణానికి సమ్మతి తెలిపారు. రూ. కోటితో మందాకిని హాస్టల్‌ రెండవ అంతస్తు నిర్మాణం కూడా  ప్రారంభం కానుంది. పీజీ, యూజీ, దూరవిద్య  పరీక్ష విభాగాలను ఒకే గూటికి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు రూ 1.91 కోట్లతో మరో భవనాన్ని నిర్మించనున్నారు.

డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మిషన్‌ కార్యాలయానికి ఎన్‌టీఆర్‌ పేరును నామకరణం చేశారు. 2017 ఫిబ్రవరిలో స్నాతకోత్సవం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. నూతనంగా 90 ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగల భర్తీకు గతంలో టెండర్లు ఆహ్వానించారు. ఇందులో నాలుగు కంపెనీలు 0 శాతం కమీషన్‌ను టెండర్లు దరఖాస్తు చేశాయి. దీంతో ఆచార్య ఫణీశ్వర రాజు కమిటీను నియమించారు. వారి సూచనల మేరకు కార్తికేయ లిమిటెడ్, విజయవాడ ఔట్‌సోర్సింగ్‌ కంపెనీకు నూతన ఉద్యోగుల భర్తీ, నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఫార్మసీ ప్రిన్సిపల్‌ ఎంపికకు సంబంధించి గతంలో ముగ్గురుని ఎంపిక చేశారు. మొదట ఎన్నుకున్న వ్యక్తి రాజీనామా చేయడంతో రెండో వ్యక్తిని నియమించారు. దీనికి పాలకమండలి ఆమోదం తెలిపింది.

మరిన్ని వార్తలు